Advertisement
Google Ads BL

పవన్ కి కొడాలి నాని సవాల్


పవన్ కల్యాణ్ కొన్ని రోజులుగా ఏపీ గవెర్నెమెంట్, ఏపీ మినిస్టర్స్ పై చేస్తున్న వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో కాక పుట్టిస్తున్నాయి. రిపబ్లిక్ ఈవెంట్ లో ఏపీ సీఎం జగన్ ని, ఏపీ మినిస్టర్స్ ఓ రేంజ్ లో ఆడుకున్న పవన్ పైకి ఏపీ మినిస్టర్స్ పేర్ని నాని దగ్గర నుండి కొడాలి అని వరకు రెచ్చిపోయి తిట్టిపారేసారు. ఇక నిన్న పవన్ కళ్యాణ్ జనసేన సభలో వైసిపి నేతలకి భయం అంటే ఏమిటో తెలియదు.. ఆ భయాన్ని నేను పుట్టిస్తాను.. లాకొకొచ్చి కొడతాను అంటూ సెన్సేషనల్ గా మాట్లాడాడు. దానితో పవన్ పై ఏపీ మంత్రులు మరోసారి విరుచుకుపడుతున్నారు.

Advertisement
CJ Advs

తాజాగా గుడివాడ ఎమ్యెల్యే, మంత్రి కొడాలి నాని పవన్ పై నోరు పారేసుకున్నాడు. పవన్ లైఫ్ లోనే మమ్మల్ని ఓడించలేడని.. నువ్వు సీఎం వైఎస్‌ జగన్‌ని మాజీ ముఖ్యమంత్రిని చేస్తే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా.. అంటూ పవన్ ని రెచ్చగొట్టారు. నువ్వు ముందు ఎమ్మెల్యేగా గెలుస్తావో లేదో చూస్కో. 2024 లో నువ్వు ఏం చేస్తావో చూద్దాం. నువ్వు చంద్రబాబు, బీజేపీ, కాంగ్రెస్‌తో కలిసి రా. చూసుకుందాం అంటూ నాని పవన్‌కు సవాలు చేశారు. ఓ సినిమా హీరో పవన్‌ కల్యాణ్‌ ఏంటి మమ్మల్ని భయపెట్టేది. ఇంకో జానీ సినిమా చూపించి భయపెడతారా. అసలు పవన్‌ని చూసి ఆయన అభిమానులు భయపడతారు. పవన్‌ స్పీచ్‌లకి జనం భయపడతారు. జగన్‌మోహన్‌రెడ్డి ఆనాడు సోనియాగాంధీకే భయపడలేదు. అలాంటిది చంద్రబాబు ఇచ్చే స్క్రిప్టులు చదివి పవన్‌ కల్యాణ్‌ మమ్మల్ని భయపెడతారా.. రా పవన్ తేల్చుకుందాం అంటూ కొడాలి నాని పవన్ కళ్యాణ్ కి సవాల్ విసిరారు.  

Kodali Nani fires on Pawan Kalyan :

Kodali Nani vs Pawan Kalyan 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs