Advertisement
Google Ads BL

పోసాని ఇంటిపై రాళ్ల దాడి..


గత రెండు రోజులుగా పవన్ కళ్యాణ్ పై పోసాని చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలోనే కాదు. బయట కూడా సెగలు రేపుతున్నాయి. పోసాని పవన్ కళ్యాణ్ ని అన్నమాటలకి ఆయన ఫాన్స్ బాగా ఫీలవుతున్నారు. ఆగ్రహంతో ఊగిపోతున్నారు. పవన్ కళ్యాణ్ సైకో, ఆయనతో సినిమాలు చేస్తే ఇక అంతే.. అమ్మాయిలకి న్యాయం చేస్తా అంటున్నావ్.. ముందు పంజాబీ హీరోయిన్ కి న్యాయం చెయ్యి అంటూ పోసాని పవన్ కళ్యాణ్ ని రెచ్చ గొట్టాడు. దానితో జనసైనికులు, పవన్ ఫాన్స్ అంతా పోసాని దొరికితే కొట్టేసేలా ఉన్నారు. దెబ్బకి భయపడిన పోసాని సామాజి గూడ ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ పెట్టి పవన్ ఫాన్స్ వలన తనకి ప్రాణ హాని ఉంది అని, తనకేదన్నా జరిగే పవన్ దే బాధ్యత అని, చిరు మీ తమ్ముడిని అదుపులో పెట్టుకోండి అంటూ వార్నింగ్ ఇచ్చిన నేపథ్యంలో ఆ రోజే పోసాని డౌన్ డౌన్ అంటూ పవన్ ఫాన్స్ ప్రెస్ క్లబ్ ముందు రెచ్చిపోయారు. తర్వాత పోసానిపై జనసేన నేతలు, పవన్ పై పోసాని పోలీస్ స్టేషన్ లో పరస్పరం కేసులు కూడా పెట్టుకున్నారు. 

Advertisement
CJ Advs

ఇక తాజాగా పోసాని ఇంటి పై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడడం కలకలం రేపింది. హైదరాబాద్ లోని ఎల్లారెడ్డి గూడలో ఉన్న పోసాని ఇంటిపై ఇటుకలు, రాళ్లతో గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు పోసాని భార్య భర్తలని బండ బూతులు తిడుతూ, ఇంటి మీదకి రాళ్లు, ఇటుకలు విసిరారని పోసాని వాచ్‌మెన్ చెబుతున్నాడు. వారిని చూసి భయంతో తాము బయటకు రాలేదని.. ఎస్ ఆర్ నగర్ పోలిస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసినట్టుగా తెలిపారు. అయితే ప్రెజెంట్ పోసాని ఎల్లారెడ్డి గూడా ఇంటిలో ఉండడం లేదు.. కొన్నాళ్లుగా ఆయన రాయదుర్గంలోనే ఉంటున్నారు. కానీ పోసాని ఇక్కడే ఉంటున్నారనుకుని రెండు రోజులుగా పోసాని ఎల్లారెడ్డి గూడా ఇంటి చుట్టూ గుర్తు తెలియని వ్యక్తులు తిరుగుతున్నారని.. గత రాత్రి దాడికి తెగ బడ్డారని అక్కడి వాచ్ మ్యాన్ చెబుతున్నాడు. 

Stones attack on Posani house:

Miscreants pelt stones at Posani Krishna Murali residence
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs