Advertisement
Google Ads BL

లవ్ స్టోరీ దర్శకుడికి ఓ అభిమాని రిక్వెస్ట్


శేఖర్ కమ్ముల సినిమాలంటే ఓ కాఫీ లాంటి ఆనంద్ సినిమా, గోదావరి లాంటి క్యూట్ లవ్ స్టోరీ, హ్యాపీ డేస్ లాంటి స్టూడెంట్స్ అల్లరి, ఫిదా లాంటి బ్యూటిఫుల్ లవ్ స్టోరీ.. ఇలా ఉంటాయి ఆయన తెరకెక్కించే సినిమాలు. కానీ అప్పట్లో రానా తో లీడర్ లాంటి పొలిటికల్ డ్రామా చేసినా.. అందులో శేఖర్ కమ్ముల మార్క్ లవ్ కనిపించింది. కానీ ఇప్పుడు ఆయన తెరకెక్కించిన లవ్ స్టోరీ సినిమా అందరూ హిట్ అంటున్నా.. కొంతమంది శేఖర్ కమ్ముల అభిమానులే హార్ట్ అవుతున్నారు. శేఖర్ కమ్ముల జోనర్ ఏమిటి.. లవ్ స్టోరీ జోనర్ ఏమిటి అంటూ ఆయన్నే డైరెక్ట్ గా సోషల్ మీడియా ద్వారా ప్రశ్నిస్తున్నారు. నాగ చైతన్య - సాయి పల్లవి కాంబోలో శేఖర్ కమ్ముల తెరకెక్కించిన లవ్ స్టోరీ మూవీ సూపర్ డూపర్ హిట్ టాక్ తో.. బాక్సాఫీసు వద్ద ప్రభంజనం సృష్టిస్తుంది. అలాంటి సినిమాపై శేఖర్ కమ్ముల అభిమాని ఒకరు ఫీలవుతున్నారంటే.. అందులో ఏదో ఒక మతలబు ఉండే ఉంటుంది.. అది ఏమిటో మీరే చూడండి. 

Advertisement
CJ Advs

కమ్ములగారూ.. కమ్మని కాఫీలాంటి సినిమాలు తీయక... ఈ కాంట్రవర్సీ మీకెందుకండీ..?

అలాంటి దరిద్రాలను పేపర్లో చదవడానిక్కూడా జనం ఇష్టపడరు.. ఏకంగా మూడుగంటలు సినిమానే తీసేశారు.. తప్పనిపించలేదా..?

ఎక్కడో ఏ నికృష్టుడో చేసిన పాపాన్ని 70MM తెరమీద చూపించడం ఇంకా మహాపాపంసార్..

మీరెవన్నా అనుకోండి.. చాలా ఇబ్బందనిపించింది..

బాబాయ్ కూతుళ్ల బంధం చాలాగొప్పది సార్..

మీ సినిమాని బాబాయ్ కూతుళ్లు కలిసి చూడగలరాసార్..?

బాబాయ్.. సినిమాకెళ్దామా అని మా అమ్మాయ్ అడిగినప్పుడల్లా.. నాకు కుదిరినప్పుడల్లా.. ఎన్నో సినిమాలు నాకూతురుతో కలిసి చూశాను.. 

ఈ సినిమా చూపించకపోయినా రేపు ఈ దరిద్రం OTT పేరుతో కొంపలోకే వస్తుంది.. ఎంత ఇబ్బందిగా ఉంటుంది చెప్పండి..?

బాబాయిలు బాధపడతారుసార్.. చిన్నాన్నలు చిన్నబుచ్చుకుంటారు..

ఆనంద్ లాంటి సినిమా తీస్తే కాదన్నామా..? 

గోదావరి లాంటి సినిమా తీస్తే వద్దన్నామా? 

హ్యాపీడేస్ లాంటి సినిమా తీస్తే చూడమన్నామా? 

ఫీదా లాంటి సినిమా తీస్తే ఫీలయ్యామా?

మీ కథలు ఎవరి గ్రీన్ సార్... వాటికి ట్రెండ్ తో పనిలేదు..  మీరు సరిగ్గా తీయండి.. ఎప్పుడొచ్చినా ఇరగాడేస్తాయ్..

అంతేగానీ మీకు సంబంధంలేని జానర్లజోలికి మాత్రం వెళ్లకండిసార్ ప్లీజ్..🙏🙏🙏

అంటూ ఓ అభిమాని శేఖర్ కమ్ముల కి చేసిన రిక్వెస్ట్.. 

A fan request to the Love Story director:

Sekhar Kammula Love Story is an unconventional reflection
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs