Advertisement
Google Ads BL

సాయి తేజ్ రిపబ్లిక్ ఫస్ట్ రివ్యూ


మెగా హీరో సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదంలో గాయపడి అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. సాయి తేజ్ నటించిన రిపబ్లిక్ మూవీ రేపు శుక్రవారమే థియేటర్స్ లొ రిలీజ్ కాబోతుంది. దేవా కట్ట దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. మంచి అంచనాలతో బరిలోకి వస్తున్న రిపబ్లిక్ మూవీ కి ఫిజికల్ గా సాయి తేజ్ ప్రమోషన్స్ చేయలేకపోతున్నాడు. దానితో ఆయన మావయ్యలు చిరు, పవన్ కళ్యాణ్ లు రిపబ్లిక్ మూవీ ప్రమోషన్స్ చేసి సినిమాపై అందరిలో ఆసక్తిని క్రియేట్ చేసారు. ఇక సాయి తేజ్ రాలేకపోవడంతో మూవీ టీం కూడా రిపబ్లిక్ ప్రమోషన్స్ ని అగ్రెస్సివ్ గా ముందుకు తీసుకుని వెళుతుంది.

Advertisement
CJ Advs

 రేపు విడుదల కాబోయే రిపబ్లిక్ మూవీ ని హీరోలు కూడా సపోర్ట్ చేస్తున్నారు. సాయి తేజ్ రిపబ్లిక్ మూవీ ని చూసాను అని, సినిమా చాలా బాగా వచ్చింది అని, Watched Republic. For all the kindness @IamSaiDharamTej has shown towards everyone around him it has come back in the form of your prayers and it’s coming back stronger in the form of #REPUBLIC. This is @devakatta‘s announcement that he is back. Congratulations to the team అంటూ హీరో నాని రిపబ్లిక్ సినిమాపై ఫస్ట్ రివ్యూ ని సోషల్ మీడియాలో ట్వీట్ చేసాడు. ఇంకా సింగర్ స్మిత, మెగా హీరోలు సాయి తేజ్ రిపబ్లిక్ టీం కి ఆల్ ద బెస్ట్ చెబుతూ ట్వీట్స్ చేస్తున్నారు. మరి సాయి తేజ్ అపోలో హాస్పిటల్ లోనే ఇంకా ట్రీట్ మెంట్ తీసుకుంటున్నాడు. ఆయన ప్రాణానికి ప్రమాదం లేకపోయినా.. మరి కొన్నాళ్ళు సాయి తేజ్ హాస్పిటల్ లోనే ఉండాల్సి వస్తుంది అని సమాచారం. 

Sai Tej Republic movie First review:

Nani watches Sai Dharam Tej and Aishwarya Rajesh Republic Movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs