Advertisement
Google Ads BL

సందీప్ కిషన్ కి నచ్చిన బిగ్ బాస్ కంటెస్టెంట్


బిగ్ బాస్ సీజన్ 5 హౌస్ లోకి ఈసారి పెద్దగా ఊరు పేరు లేని సెలబ్రిటీస్ ఎక్కువమంది ఉన్నారు. హౌస్ లో మొదటి వారం లో ఏకంగా 19 మంది ఉండేసరికి.. చిన్న పిల్లల స్కూల్ మాదిరి కనిపించారు. హమీద, జెస్సి లాంటి ఫేస్ లు ఇంతవరకు బుల్లితెర ప్రేక్షకులకి తెలియనే తెలియవు. మానస్ అంటే సీరియల్స్ తోనూ, శ్రీరామ చంద్ర సింగర్ గాను, యాంకర్ రవి బుల్లితెర స్టేజెస్ మీద, సిరి సీరియల్స్, షణ్ముఖ్ వెబ్ సీరియస్ లతోనూ హైలెట్ అయ్యారు. ఇక హౌస్ లో ఇంతవరకు ఎవరు ఫేక్, ఎవరు జన్యూన్ అంటే ఎవరూ చెప్పలేకపోతున్నారు. ఎవరు చూసినా బిగ్ బాస్ గేమ్ ని కాచి ఓడపోసినట్టుగానే  వాడేస్తున్నారు తప్ప.. ఎవ్వరూ.. తమలా ఆడడం లేదు. 

Advertisement
CJ Advs

అయితే హీరో సందీప్ కిషన్ కి ఇప్పుడు బిగ్ బాస్ లొ ఓ కంటెస్టెంట్ నచ్చాడట. దానితో తన సపోర్ట్ ఆ కంటెస్టెంట్ కే అంటున్నాడు. అతనెవరో కాదు. ఒకటి అరా సినిమాలతోను, సీరియల్స్ తో ఆకట్టుకున్న మానస్ నాగులపల్లి. మానస్ హౌస్ లోకి అడుగుపెట్టినప్పటినుండీ జన్యూన్ గా తన గేమ్ తాను ఆడుతున్నాడని, మొదటి నుండి ఒకేలా మానస్ గేమ్ లో ఉన్నాడని.. అందుకే మానస్ అంటే తనకి ఇష్టమని సందీప్ చెప్పడంతో.. ఇప్పుడు బిగ్ బాస్ టైటిల్ ఫెవెరెట్ ప్లేస్ లోకి మానస్ వెళ్ళిపోయాడు. టాప్ 5 లో మానస్ ఖచ్చితంగా ఉంటాడు. ఓ హీరో సపోర్ట్ కూడా దొరికేసింది అని అంటున్నారు.  

Hero Sundeep Kishan Supports Maanas:

Bigg boss 5: Sundeep Kishan Supports Maanas
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs