Advertisement
Google Ads BL

కీర్తి అలా.. రీతు ఇలా


మహేష్ బాబు తో కీర్తి సురేష్ సర్కారు వారి పాట సినిమా షూటింగ్ లో బిజీగా ఉండడమే కాదు.. ఈమధ్యన పలు బ్రాండ్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా యాడ్స్ లో హడావిడి చేస్తుంది. బరువు తగ్గాక కీర్తి సురేష్ గ్లామర్ పెరిగినా.. ఫేస్ లో కళ కోల్పోయింది. అయినప్పటికీ.. పలు కంపెనీస్ కి బ్రాండ్ అంబాసిడర్ గా కీర్తి సురేష్ బిజీగా మారిపోయింది. ఇక ఈమధ్యన సోషల్ మీడియాలో యోగ పిక్స్ అని, ఇంకా తన పెట్స్ తో ఆడుకునే పిక్స్ ని పోస్ట్ చేస్తూ యాక్టీవ్ గా మారిన కీర్తి సురేష్.. తాజాగా ఓ పిక్ ని పోస్ట్ చేసింది. క్యూట్ గా స్వీట్ గా ఉన్న పిక్ ని పోస్ట్ చేస్తూ మిడ్ వీక్ మూడ్స్ The perfect midweek mood 🌺 అంటూ ట్వీట్ చేసింది. కీర్తి సురేష్ ఆ పిక్ లో సైడ్ లుక్ లో లూజ్ హెయిర్ తో కీర్తి సురేష్ స్మైల్ చాలా బావుంది.

Advertisement
CJ Advs

ఇక ఈ ఏడాది టక్ జగదీశ్ సినిమాలో చాలా ట్రెడిషనల్ గా, చాలా అందంగా గుమ్మడి వరలక్ష్మి గా ప్రభుత్వ ఉద్యోగి పాత్రలో అదరగొట్టేసింది రీతు వర్మ.. దసరా స్పెషల్ గా న శౌర్య తో వరుడు కావలెను సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. వరుడు కావలెను సినిమాలో పెళ్లి అంటే ఇష్టం లేని తలతిక్క అమ్మాయిగా కనిపించబోతుంది. వరుడు కావలెను సినిమాలోనూ రీతు వర్మ పద్దతిగా సారీస్ లోనే కనిపించబోతుంది. మరి ట్రెడిషనల్ కేరెక్టర్స్ కి కేరాఫ్ అయిన రీతు వర్మ ఒక్కసారిగా గ్లామర్ లుక్ లోకి మారిపోతే.. మారిపోయింది. తాజాగా రీతు వర్మ సోషల్ మీడియాలో షేర్ చేసిన పిక్ చూస్తే వార్ని రీతు వర్మ గ్లామర్ లుక్ అదిరింది గా అంటారు. లూజ్ హెయిర్ తో జీన్స్ ప్యాంట్ తో రీతు వర్మ పిక్ మాత్రం నిజంగా గ్లామర్ గా ఉంది. 

Keerthy Suresh is like that, Ritu Varma is like this:

Keerthy Suresh and Ritu Varma social media pic viral 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs