Advertisement
Google Ads BL

ఇండస్ట్రీ పెద్దలుకు ఏపీ ప్రభుత్వ ఆహ్వానం.


ప్రస్తుతం పవన్ కళ్యాణ్ మేటర్ వేడి వేడిగా ఉన్న టైం లోనే ఏపీ ప్రభుత్వం ఇండస్ట్రీలోని పలువురు పెద్దలని మీటింగ్ కి ఆహ్వానించినట్టుగా తెలుస్తుంది. రిపబ్లిక్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ ఏపీ ప్రభుత్వం పై, మినిస్టర్స్, సినిమా ఇండస్ట్రీలో జగన్ కి సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరిని పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తూ మాటల తూటాలతో ఆడేసుకున్నారు. దానితో ఏపీ మినిస్టర్స్, సినీమా ఇండస్ట్రీలో జగన్ అభిమానులు పవన్ కళ్యాణ్ పై ఒంటి కాలిపై లేస్తున్నారు. అంతేకాదు.. సినిమా ఇండస్ట్రీ వారు కూడా పవన్ వ్యాఖ్యలతో తమకి ఎలాంటి సంబంధం లేదని ప్రటించేసారు. 

Advertisement
CJ Advs

ఆఖరికి మంచు విష్ణు కూడా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలతో ఏకీభవించను అని మీడియా ముఖంగా చెప్పాడు. ఇండస్ట్రీ ఓ ఒకవైపు, పవన్ ఒక్కడే ఓ వైపు అన్నట్టుగా ఉంది ప్రెజెంట్ పరిస్థితి. అయితే ఇలాంటి టైం లో ఏపీ ప్రభుత్వం ఇండస్ట్రీ పెద్దలని మీటింగ్ కి ఆహ్వానించడం హాట్ టాపిక్ అయ్యింది. ఇండస్ట్రీ పెద్దలకి రేపు ప్రభుత్వ ప్రతినిధుల తో విజయవాడ లో సమావేశం జరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. మరి ఈ మీటింగ్ కి చిరు, నాగ్, సురేష్ బాబు, దిల్ రాజు లాంటి పెద్దలు హాజరవుతారో.. లేదంటే మొన్నటి మాదిరి సి కళ్యాణ్ బ్యాచ్ హాజరవుతుందో చూడాలి. ఏది ఏమైనా ఈ మీటింగ్ మాత్రం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. 

AP Government welcome Telugu film industry members :

Telugu film industry members welcome AP Government 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs