Advertisement
Google Ads BL

పుష్ప రాజ్ లవ్ శ్రీవల్లి వచ్చేసింది


అల్లు అర్జున్ పుష్ప రాజ్ గా నటిస్తున్న పుష్ప పాన్ ఇండియా మూవీ ప్రమోషన్స్ మొదలైపోయాయి. క్రిష్ట్మస్ టార్గెట్ గా తెరకెక్కుతున్న పుష్ప మూవీ నుండి పుష్ప రాజ్ లవ్ శ్రీవల్లి పాత్రధారి రష్మిక మందన్న లుక్ ని రివీల్ చేసింది పుష్ప టీం. నిన్న పుష్ప నుండి పుష్ప లవ్ రాబోతుంది అని అప్ డేట్ ఇచ్చినప్పటి నుండే.. రష్మిక లుక్ పై అందరిలో ఆసక్తి పెరిగిపోయింది. పుష్ప టీజర్ లోనే లంగా వోణి తో, పల్లెటూరి గెటప్ లో తల నిండా పూల తో డిఫ్రెంట్ గా కనిపించిన రష్మిక శ్రీవల్లీ లుక్ నిజంగా అద్భుతమే. దర్శకుడు సుకుమార్ రష్మిక ని శ్రీవల్లి కేరెక్టర్ లో చూపించబోతున్నాడు. పుష్ప రాజ్ లవర్ గా రష్మిక కనిపించబోతుంది. Our fiercest #PushpaRaj's heart melts at the sight of his love ❤️

Advertisement
CJ Advs

Meet @iamRashmika as #Srivalli 😍

#SoulmateOfPushpa 

అంటూ రష్మిక లుక్ ని రివీల్ చేసారు. ఈ లుక్ లో రష్మిక ఎప్పుడూ కనిపించని లుక్ లో దర్శనమిచ్చింది. గ్లామర్ గా అది కూడా డీ గ్లామర్ గా శారీలో, చెవికి పోగులు పెట్టుకుంటూ .. అదో టైప్ లో కూర్చున్న శ్రీవల్లి ముందు మల్లెపూల దండలు.. చాప అంతా కొత్తగా కనిపిస్తుంది. ఇంకా చేతికి గాజులు లేకుండా అచ్చమైన పల్లెటూరి అమ్మాయిలా రష్మిక శ్రీవల్లి లుక్ కనిపిస్తుంది. మరి పుష్ప రాజ్ గా అల్లు అర్జున్ మాస్ లుక్ కి రష్మిక ఈ మాత్రం డీ గ్లామర్ లుక్ ఉండాల్సిందే. అందుకే పుష్ప రాజ్ లవ్ శ్రీవల్లి కూడా పుష్ప కి పర్ఫెక్ట్ మ్యాచ్ అయ్యింది అంటున్నారు ఫాన్స్. 

Pushpa: Rashmika Mandanna Intense Look:

Pushpa: Meet Rashmika as Srivalli
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs