అక్టోబర్ 13 న ఆర్.ఆర్.ఆర్ ని రిలీజ్ చెయ్యడం లేదని రాజమౌళి ఎప్పుడైతే ఎనౌన్స్ చేసారో.. అప్పుడే ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్ ఫాన్స్ తో పాటుగా పాన్ ఇండియా ప్రేక్షకులు నీరస పడిపోయారు. అసలే జనవరి లో విడుదల కావాల్సిన ఆర్.ఆర్.ఆర్ అక్టోబర్ లో అయినా విడుదలవుతుంది అనుకుంటే వరల్డ్ వైడ్ గా థియేటర్స్ క్లోజ్ ఉండడంతో ఆర్.ఆర్.ఆర్ ని వాయిదా వేసేసారు. అయితే రీసెంట్ గా బాలీవుడ్ మూవీస్ ఒక్కసారిగా తమతమ రిలీజ్ డేట్స్ ని ప్రకటించాయి. కానీ రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ డేట్ ఇవ్వకుండా కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు బాలీవుడ్ మీడియా కూడా రాజమౌళి వైపే చూస్తుంది. ఆర్.ఆర్.ఆర్ డేట్ ఎప్పుడు ఇస్తారా అని.
తాజాగా ఆర్.ఆర్.ఆర్ హాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఎందుకంటే ఆర్.ఆర్.ఆర్ అప్ డేట్ త్వరలోనే.. క్రిష్ట్మస్ కానీ, జనవరి 2022 సంక్రాంతికి కానీ ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ ఉండొచ్చు.. రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ నిర్మాతలు ఆ రెండు డేట్స్ పై కన్నేసారు. త్వరలోనే ఈ రెండు డేట్స్ లో ఏదో ఓక్ డేట్ ని లాక్ చేసి ప్రకటిస్తారంటూ.. సోషల్ మీడియాలో స్టార్ హీరోల ఫాన్స్ ఆర్.ఆర్.ఆర్ ని ట్రెండ్ చేస్తున్నారు. మరి ఆర్.ఆర్.ఆర్ మేకర్స్ త్వరలోనే ఆ ప్రకటన ఏదో చేస్తేనే కానీ లేదంటే ఫాన్స్ ఊరుకునేలాలేరు. ఒకవేళ క్రిష్ట్మస్ కి ఆర్.ఆర్.ఆర్ అంటే పుష్ప భయపడుతుంది, అలాగే సంక్రాంతికి అంటే రాధేశ్యామ్, పవన్ భీమ్లా నాయక్, మహేష్ సర్కారు వారి పాట వెనక్కి తగ్గాల్సి వస్తుంది.