Advertisement
Google Ads BL

నాకేం జరిగినా పవన్ దే బాధ్యత: పోసాని


పోసాని పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యల ఫలితం.. జనసేన కార్యకర్తలు, పవన్ ఫాన్స్ అంతా పోసాని కృష్ణ మురళి అంతు చూస్తామంటూ బయలు దేరారు. పవన్ కళ్యాణ్ ని రాజకీయంగా కాదు.. పర్సనల్ గా అనరాని మాటలతో పోసాని రెచ్చిపోయి మాట్లాడారు. పవన్ కళ్యాణ్ కి నా మీద కోపం ఉంది. ఓ సినిమా విషయంలో ఆయనకు నాకు గొడవైంది. నేను పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడింది నిజం. అయినా రా నువ్వు నేను తేల్చుకుందాం. అంతేకాని నా ఫ్యామిలీ ని ఈ ఇష్యులోకి లాగొద్దు.. పవన్ కి శీలం లేదు.. అంటూ పోసాని సెన్సేషనల్ గా మాట్లాడాడు. పవన్ కి ఇద్దరు ముగ్గురు భార్యలు ఉన్నారు. కానీ నాకు ఒక్కరే భర్య. నేను నా భర్య లేనిదే బ్రతకలేను. నా భార్య నాకో ఫ్రెండ్ అంటూ పోసాని పవన్ పై కామెంట్స్ చేసారు.

Advertisement
CJ Advs

ఇక పోసాని పవన్ నువ్వొక సైకోవి, నీ ఫాన్స్ ని అదుపులో పెట్టుకో.. ఇతర హీరోల ఈవెంట్స్ కి నీ ఫాన్స్ ని పంపి పవన్ నామ జపం చేయిస్తావు.. అంటూ సంచలంగా మాట్లాడారు.

పోసాని కృష్ణ మురళి ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడుతుండగా.. జనసేన కార్య కర్తలు పోసాని మీదకి వెళ్లబోయారు. అక్కడ ప్రెస్ క్లబ్ ముందు పవన్ ఫాన్స్ హంగామా సృష్టించారు. పవన్ కాదు సైకో.. పోసాని సైకో, పవన్ ని ఎమన్నా అంటే ఊరుకోమంటూ పోసానిని జనసేన కార్యకర్తలు హెచ్చరించారు. పవన్ ఫాన్స్ ని, జనసేన కార్యకర్తలని చెదరగొట్టడానికి పోలీస్ లు శతవిధాలా ప్ప్రయత్నించారు. ప్రస్తుతం సోమాజీ గూడ ప్రెస్ క్లబ్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దానితో పోసాని ని పోలీస్ కారు ఎక్కించి అక్కడినుండి పంపేశారు. పోసాని కృష్ణ మురళి మాత్రం అక్కడి నుండి వెళ్ళిపోతూ.. నాకు నా ఫ్యామిలీకి ఎమన్నా జరిగితే పవన్ దే బాధ్యత అంటూ ఆయనకారెక్కేసి వెళ్లిపోగా.. జనసేన కార్యకర్తలు తమ నాయకుడు పవన్ ని పోసాని అనరాని మాటలు ఆయన ఆయన అంటు చూస్తామంటూ హంగామా సృష్టిస్తున్నారు. ఇంకా పవన్ పై పోసాని రేపు కేసు పెడతా అంటూ సోమాజీ గూడా నుండి కారులో వెళ్లిపోయారు పోసాని. 

Posani Krishna Murali vs Pawan fans:

Posani vs janasena party
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs