Advertisement

చిరంజీవి గారు మీ తమ్ముణ్ణి అదుపులో పెట్టుకోండి.


నిన్న సోమవారం రాత్రి పోసాని కృష్ణ మురళి పవన్ కళ్యాణ్ పై పరుష పదజాలంతో విరుచుకు పడిన విషయం తెలిసిందే. పోసాని వైసిపికి వకాల్తా పుచ్చుకుని పవన్ కళ్యాణ్ ని నానా మాటలు అన్నాడు అంటూ పవన్ ఫాన్స్, జనసేన కార్యకర్తలు పోసానిపై విరుచుకుపడుతున్నారు. పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీ మనిషి కాదు, రాజకీయ నాయకుడు కాదు.. జగన్ అంటే నాకు అభిమానం ఉంది. ఆయన్ని ఎమన్నా అంటే నేను చూస్తూ ఊరుకోను అంటూ పవన్ కళ్యాణ్ పర్సనల్ విషయాలనూ పోసాని లైవ్ లోనే కెలికేసాడు. అయితే మళ్ళీ ఈ రోజు మంగళవారం ప్రెస్ క్లబ్ లో పోసాని కృష్ణమురళి ప్రెస్ మీట్ పెట్టి.. పవన్ కళ్యాణ్ ని ప్రశ్నించినందుకు నన్ను బెదిరిస్తూ కొన్ని వేల ఫోన్ కాల్స్ వచ్చాయి. నేను ఏది మాట్లాడినా మీడియా ముందే మాట్లాడాను.. కానీ వెనక ఏం మాట్లాడను.. పవన్ ని అంటే ఆయన ఫాన్స్ నన్ను బెదిరిస్తున్నారు. 

Advertisement

మీ నాయకుడు ఎంత గొప్పవాడంటే.. ఒకసారి సర్దార్ గబ్బర్ సింగ్ షూటింగ్ నైట్ చెయ్యాల్సి వచ్చింది.. నేను సాయంత్రం 6 దాటితే షూటింగ్ చెయ్యను. కానీ పెద్ద హీరో సినిమా కదా అని 9 గంటల వరకు ఉన్నా ఆయన లొకేషన్ కి రాలేదు. నేను వెళ్ళిపోయి ఇంట్లో భోజనం చేస్తున్న టైం లో ఫోన్ చేసి చెప్పకుండా ఎలా వెళ్ళిపోతారు అంటూ నా మీద కేకలు వేశారు. నేను కూడా మీరు 10గంటలకు వస్తే, మేము అప్పటివరకూ ఉండాలా? నేను కూడా ఆర్టిస్ట్‌నే. 9 గంటల వరకూ వేచి చూశా. నువ్వు రాలేదు అనగానే.. ఆ సినిమా నుండి నన్ను తీసేసారు. 

అప్పటినుండి నేనంటే పవన్ కి కడుపుమంట. ఇప్పుడు కూడా ఇండస్ట్రీ నన్ను బ్యాన్ చేసినా పర్లేదు అంటూ మరోసారి పవన్ పై పోసాని విరుచుకుపడ్డారు. అంతేకాకుండా ఏదైనా సినిమా ఈవెంట్స్ కి పవన్ ఫాన్స్ మంటూ వచ్చేసి పవన్, పవర్ స్టార్ అంటూ గోల గోల చేస్తారు. అంతెందుకు నేడు మంచు విష్ణు మా ఎన్నికల నామినేషన్ వేయడానికి వెళితే అక్కడికి 10 మంది పవన్ ఫాన్స్ మంటూ వచ్చి హంగామా చేసారు.. పవన్‌కల్యాణ్‌.. నీ సైకో ఫ్యాన్స్‌కు ఏం చెప్పుకుంటావో చెప్పుకో.. పొలిటికల్ గా నన్ను టార్గెట్ చెయ్యి, నాది తప్పంటే నీకు దణ్ణం పెడతాను. కానీ నా ఫ్యామిలీని ఇందులోకి లాగొద్దు. చిరంజీవి గారు మీ తమ్ముణ్ణి అదుపులో పెట్టుకోండి అంటూ పోసాని పవన్ కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చేసారు. 

Chiranjeevi, keep your brother in control:

Once again Posani fires on Pawan Kalyan 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement