కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ కి ఉన్న క్రేజ్ తో తాను పార్టీ పెట్టి.. పైకి వచ్చేద్దామని.. ప్లాన్ చేసిన విజయ్ తండ్రికి కొడుకు విజయ్ ఎప్పటికప్పుడు అడ్డు పడడంతో.. చివరికి కొడుకు విజయ్ దెబ్బకి తండ్రి చంద్ర శేఖర్ పార్టీ మూసేసాడు. కోలీవుడ్ లో రజిని తర్వాత అంతటి ఫాలోయింగ్ ఉన్న హీరోగా విజయ్ కి విపరీతమైన ఫ్యాన్ గణం ఉంది. ఎప్పటినుండో విజయ్ రాజకీయ ఎంట్రీ పై కోలీవుడ్ మీడియాలో బోలెడంత చర్చ జరిగినా.. విజయ్ ఎప్పుడు రాజకీయాల గురించి మాట్లాడలేదు. కానీ విజయ్ తండ్రి చంద్ర శేఖర్ తల్లి శోభా లు విజయ్ క్రేజ్ ని అడ్డం పెట్టుకుని ఆలిండియా తళపతి విజయ్ మక్కల్ ఇయ్యకమ్ పేరు మీద పార్టీ స్థాపించి.. తన కొడుకు సపోర్ట్ తనకి ఉంది అని ప్రకటించారు.
వెంటనే విజయ్ లైన్ లో కొచ్చి తనకి తన తండ్రి పార్టీ ఆలిండియా తళపతి విజయ్ మక్కల్ ఇయ్యకమ్ ఎలాంటి సంబంధం లేదని ప్రకటించిన.. తండ్రి చంద్ర శేఖర్ మాత్రం విజయ్ పేరు మీదే ఆలిండియా తళపతి విజయ్ మక్కల్ ఇయ్యకమ్ పార్టీ కార్యకలాపాలను కొనసాగించడంతో.. విజయ్ తండ్రి, తల్లి, ఇంకా ఓ 11 మందిపై కేసు పెట్టాడు. తన తల్లి తండ్రి పెట్టిన పార్టీ కోసం తన పేరు, తన ఫోటోలు ఉపయోగిస్తున్నారని అంతేకాకుండా ఫ్యాన్స్ క్లబ్ ను కూడా దుర్వినియోగం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని కేసు పెట్టడంతో ఆ కేసు కోర్టులో వాయిదాకి వచ్చింది. అయితే కోర్టుకి వెళ్ళిన విజయ్ తండ్రి తన కుమారుడి పేరిట ఏర్పాటు చేసిన పార్టీని వెంటనే రద్దు చేస్తున్నట్టు.. అంతేకాకుండా పార్టీకి సంబంధించిన అన్నింటిని కోర్టుకు సమర్పిస్తున్నట్టు తెలియజేసారు. అయితే ఇప్పుడు ఆ పార్టీ పేరుని ఫ్యాన్ అసోసియేషన్‌గా కొనసాగిస్తామని విజయ్ తండ్రి తెలియజేసారు. కానీ విజయ్ ఫాన్స్ మాత్రం విజయ్ ని సినిమాలు చేసుకోనివ్వండి.. రాజకీయాల్లోకి లాగొద్దు అంటూ డిమాండ్ చేస్తున్నారు.