Advertisement
Google Ads BL

లైగర్ సెట్స్ లో పూరి బర్త్ డే సెలెబ్రేషన్స్


లైగ‌ర్ సెట్లో గ్రాండ్‌గా జ‌రిగిన‌ డాషింగ్ డైరెక్ట‌ర్ పూరిజ‌గ‌న్నాధ్ బ‌ర్త్‌డే సెల‌బ్రేష‌న్స్‌

మోస్ట్ హ్యపెనింగ్ హీరో  విజయ్ దేవరకొండ - డాషింగ్ డైరెక్ట‌ర్ పూరిజ‌గ‌న్నాధ్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతోన్న క్రేజీ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ లైగర్. సాలా క్రాస్ బ్రీడ్ అనేది ట్యాగ్‌లైన్‌. ప్యాన్ఇండియా మూవీగా రూపొందుతోన్న ఈ  సినిమాపై అటు అభిమానుల్లో ఇటు ప్రేక్ష‌కుల్లో భారీ అంచనాలున్నాయి. ప్రస్తుతం లైగర్ చిత్రీకరణ గోవాలో జరుగుతుంది. ఈ రోజు(సెప్టెంబ‌రు 28) డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాధ్ పుట్టిన‌రోజు. ఈ సంద‌ర్భంగా లైగ‌ర్ సెట్లో పూరిజ‌గ‌న్నాధ్ బ‌ర్త్‌డే సెల‌బ్రేష‌న్స్ గ్రాండ్‌గా జ‌రిగాయి. ఈ వేడుక‌ల్లో చిత్ర యూనిట్ స‌మక్షంలో బ‌ర్త్‌డే కేక్ క‌ట్ చేశారు పూరి జ‌గ‌న్నాధ్‌. ప్ర‌స్తుతం ఆ ఫోటోలు సోష‌ల్‌మీడియాలో వైర‌ల్ అయ్యాయి.  

లైగ‌ర్ చిత్రం ద్వారా ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత బాక్స‌ర్ మైక్ టైసన్ మొదటి సారిగా ఇండియన్ స్క్రీన్‌కు పరిచయమ‌వున్నారు. ఈ అనౌన్స్‌మెంట్ కి అద్భుత‌మైన రెస్పాన్స్ వ‌చ్చింది. ఇండియా వైడ్ గా ట్విట్ట‌ర్ లో ట్రెండ్ అయ్యింది.  బాలీవుడ్ స్టార్ ప్రొడక్షన్ కంపెనీ ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

Advertisement
CJ Advs

Puri Jagannadh Birthday Celebrations :

Puri Jagannadh Birthday Celebrations at Liger Sets
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs