నటుడు ప్రకాష్ రాజ్ - మంచు విష్ణు లు మా ఎన్నికల్లో అధ్యక్ష పీఠం కోసం నువ్వా - నేనా అని పోటీ పడుతున్న విషయం తెలిసిందే. నిన్న ప్రకాష్ రాజ్ ప్యానల్ మా ఎన్నికల్లో నామినేషన్ వెయ్యడానికి రాగా.. ఈ రోజు మంచు విష్ణు తన ప్యానల్ తో భారీ ర్యాలీతో నామినేషన్ వేశారు. తదుపరి మంచు విష్ణు మీడియా తో మాట్లాడుతూ ప్రకాష్ రాజ్ గారు పవన్ కళ్యాణ్ కి మద్దతు పలుకుతున్నారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలతో సినిమా ఇండియాస్ట్రీనే ఏకీభవించలేదు.. అది ఆయన పర్సనల్.. అయినా ప్రకాష్ రాజ్ గారు సినిమా ఇండస్ట్రీకి వ్యతిరేఖంగా మాట్లాడిన పవన్ ని సపోర్ట్ చేస్తారా.. అంటూ నిన్న ప్రకాష్ రాజ్ పవన్ ని సపోర్ట్ చేస్తూ చేసిన ట్వీట్ పై మాట్లాడారు. సినిమా ఇండస్ట్రీ పవన్ వ్యాఖ్యలతో సంబంధం లేదు అని అంది.. నేను ఇండస్ట్రీ వ్యక్తిని. కానీ ప్రకాష్ రాజ్ గారు పవన్ వైపు ఉంటారో.. లేదంటే ఇండస్ట్రీ వైపు ఉంటారో చెప్పాలని డిమాండ్ చేసారు.
ఇక మా ఎన్నికల్లో తన మ్యానిఫ్యాస్టో చూస్తే పవన్ దగ్గర నుండి చిరు వరకు తనకే ఓటు వేస్తారని, తనకి 900 మంది మా సభ్యుల సపోర్ట్ ఉంది అని మంచు విష్ణు మీడియాతో మాట్లాడారు. ఇక మీరు మా సభ్యులకి డిన్నర్ పార్టీ ఇచ్చారట కదా అని మీడియా అడిగిన ప్రశ్నకు మంచు విష్ణు తనదైన స్టయిల్ లో సమాధానం ఇచ్చారు. నేను షూటింగ్స్ కి వెళ్ళనపుడు నా పిల్లలని చూసుకుంటాను, నా భార్య జాబ్ చేస్తుంది. నేను నవంబర్ నుండి షూటింగ్ కి వెళ్ళాలి.. నేను పిల్లలని చూసుకుంటున్నప్ప్పుడు నేను నైట్ వెళ్లి పార్టీలు ఎలా ఇస్తాను, ఇక నేను గిఫ్ట్ లు ఇస్తున్నా అంటున్నారట. నాకు ఎవరన్నా గిఫ్ట్ ఇచ్చేవారుంటే బావుండు అని నేను అనుకుంటున్నాను అంటూ ఫన్నీ కామెంట్స్ చేసారు.