Advertisement
Google Ads BL

పుష్ప రిలీజ్ డేట్ చేంజ్


అల్లు అర్జున్ - సుకుమార్ కాంబోలో మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న పుష్ప మూవీ పై ఇండియా వైడ్ గా భారీ అంచనాలే ఉన్నాయి. అల్లు అర్జున్ పుష్ప రాజ్ కల్డ్ మాస్ లుక్ పై అందరిలో అంతకంతకు అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన పుష్ప టీజర్ చూసాక సినిమాపై మరింతగా క్యూరియాసిటీ పెరిగిపోయింది. సెకండ్ వేవ్ లేకపోతె ఆగష్టు 13 నే పుష్ప రిలీజ్ అయ్యేది.. కానీ ఈ సినిమా ఇప్పుడు క్రిష్ట్మస్ బరిలోకి వెళ్ళింది. సేఫ్ గా డిసెంబర్ లో రిలీజ్ చెయ్యడానికి సుకుమార్ అండ్ టీం ప్లాన్ చేసుకుంది

Advertisement
CJ Advs

కానీ అనూహ్యంగా బాలీవుడ్ మూవీస్ ఇప్పడూ పుష్ప మూవీ మీద దండయాత్రకు దిగాయి. అక్కడ మహారాష్ట్రలో పూర్తి స్థాయిలో థియేటర్స్ ఓపెన్ కానందువల్ల చాలా సినిమాలు రిలీజ్ కి దగ్గరగా వచ్చి ఆగిపోయాయి. వచ్చే నెల నుండి థియేటర్స్ ఓపెన్ అవడంతో బాలీవుడ్ మూవీస్ పొలోమంటూ థియేటర్స్ కి క్యూ కట్టాయి. చాలా సినిమాలు జస్ట్ వారాల గ్యాప్ లో థియేటర్స్ లోకి వచ్చేస్తున్నాయి. ఇక క్రిష్ట్మస్ టైం లో రన్వీర్ సింగ్ నటించిన 83 రిలీజ్ డేట్ వ్వడంతో.. హిందీ మర్కెట్ లో పుష్ప కి దెబ్బ పడే అవకాశం ఉంది.  అందులోను 83 ని రన్వీర్ సింగ్ పలు భాషల్లో రిలీజ్ చెయ్యడం, ఆ సినిమాలో రన్వీర్ - దీపికా లాంటి భారీ తారాగణం ఉండడంతో పుష్ప హిందీ మర్కెట్ లో ప్రాబ్లమ్స్ ఫేస్ చెయ్యాల్సి వస్తుంది అనే ఆలోచనలో సుకుమార్ అండ్ పుష్ప టీం ఉందట. 

అంటే దీన్నిబట్టి పుష్ప సినిమాని క్రిష్ట్మస్ కి ముందు అంటే ఓ వారం ముందు కాని.. లేదంటే ఓ వారం తర్వాత కానీ రిలీజ్ చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనలో పుష్ప మేకర్స్ ఉన్నట్లుగా సోషల్ మీడియా టాక్. 

Pushpa release date change once again?:

Pushpa release date is likely to change once again
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs