Advertisement
Google Ads BL

పవన్ స్టయిల్లో రిప్లై


పవన్ కళ్యాణ్ రిపబ్లిక్ మూవీ ఈవెంట్ లో చేసిన వ్యాఖ్యల ఫలితం.. ఏపీ మంత్రులు మాత్రమే కాదు.. సినీ నటుడు వైసిపి నేత పోసాని కృష్ణ మురళి ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడిన విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ పై పోసాని ఓ రేంజ్ లో మండిపడ్డారు. పవన్ అమ్మాయిలకి న్యాయం చెయ్యాలనుకుంటే ముందు పంజాబ్ హీరోయిన్ కి న్యాయం చెయ్యాలి.. ఇండస్ట్రీలో ఓ ప్రముఖుడు ఆ హీరోయిన్ ని మోసం చేసి ప్రేమించి, కడుపు చేసి ఆఖరికి సెటిల్మెంట్ చేసుకున్నాడు. ఇప్పుడు పవన్ గనక ఆ అమ్మాయికి న్యాయం చేస్తే గుడి కడతాను, అలాగే ఏపీ సీఎం జగన్ ని అనే దమ్ము పవన్ కి లేదు. పవన్ సాక్ష్యాధారాలు చూపించి మాట్లాడు.. అంటూ వైసిపికి మద్దతుగా పవన్ కి వ్యతిరేఖంగా పోసాని రెచ్చిపోయి మాట్లాడాడు.

Advertisement
CJ Advs

దానికి పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా ద్వారా రియాక్ట్ అయ్యారు. తనపై వైసిపి నేతలు, పోసాని చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్..  తుమ్మెదల ఝుంకారాలు, నెమళ్ల క్రేంకారాలు, ఏనుగుల ఘీంకారాలు, వైసీపీ గ్రామసింహాల(కుక్కల) గోంకారాలు సహజమే అంటూ ట్వీట్ చెయ్యడంతో.. పవన్ ఫాన్స్ పవన్ హుందాగా ఆయన స్టయిల్లో పోసానికి బ్రహ్మాండమైన కౌంటర్ ఇచ్చారు అంటూ హడావిడి చేస్తున్నారు. ఇంకా పవన్ హు లెట్‌ ది డాగ్స్‌ ఔట్‌ అనే సాంగ్ ని షేర్‌ చేస్తూ నాకు ఇష్టమైన పాట అంటూ ట్వీట్ చేసి ఒకే ఒక్క ట్వీట్ తో పోసానికి ఘాటైన రిప్లై ఇచ్చేసారు. 

Pawan Kalyan Vs Posani Krishna Murali:

Pawan tweet on Posani Press meet
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs