Advertisement
Google Ads BL

పంజాబ్ అమ్మాయికి న్యాయం చెయ్యి పవన్


రిపబ్లిక్ ఈవెంట్ లో పవన్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గా పోసాని కృష్ణ మురళి.. ప్రెస్ మీట్ పెట్టి పవన్ పై సంచలన వ్యాఖ్యలు చేసారు. పోసాని పవన్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడడమే కాదు.. ఓ సినిమా ఈవెంట్ లో పొలిటికల్ విషయాలు ఎలా మాట్లాడతారు, ఏపీ ముఖ్యంమత్రి, మంత్రులపై సినిమా ఈవెంట్ లో ప్రశ్నించడం ఏమిటి. అసలు పవన్ పరిశ్రమలోని సమస్యలు పరిష్కరిస్తే చాలు.. ఓ పంజాబ్ అమ్మాయి.. సినిమా ఇండస్ట్రీకి ఎన్నో కలలతో వచ్చి సినిమాలు చెయ్యాలి అనుకుంటే.. ఇండస్ట్రీలోని ఓ ప్రముఖుడు అవకాశాలు ఇస్తామని చెప్పి కడుపు చేసి.. పెళ్లి చేసుకుంటాని అని చెప్పి.. ఆమెని మోసం చెయ్యడమే కాదు.. ఆ అమ్మాయికి కొన్ని కోట్లు సెటిల్ చేసారు. ఓ ఐదు కోట్లు అనేది నాకు తెలుసు. 

Advertisement
CJ Advs

ఆ పంజాబ్ యువతి పేరు పవన్ కళ్యాణ్ కి చెబుతాను.. ప్రశ్నించే దమ్మున్న పవన్ ఆమెకి న్యాయం చేస్తాడా? ఆమె కోసం పవన్ పోరాడతాడా? ఆ యువతికి న్యాయం చెయ్యకపోతే.. పవన్ కి ప్రశ్నించే హక్కు లేదు, ఆ యువతికి న్యాయం చేస్తే పవన్ కి గుడి కడతాను..  అంటూ పోసాని సెన్సేషనల్ గా మాట్లాడగా.. ఇప్పుడు ఇండస్ట్రీలో ఆ పంజాబ్ అమ్మయిని మోసం చేసిన ఆ ప్రముఖుడు ఎవరా అంటూ అనుమానాలు, ఆరాలు మొదలైపోయాయి. అంటే పవన్ కి తెలిసిన వారే అయ్యుంటారు. అందుకే పోసాని పవన్ కి ఆమె పేరు చెవిలో చెబుతా అంటున్నారు. పవన్ కి బాగా క్లోజ్ అయిన వారే ఆ యువతిని మోసం చేసి ఉంటారంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో రకరాల కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. 

Posani Krishna Murali fires on Pawan Kalyan:

Posani Krishna Murali comments on Pawan Kalyan
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs