Advertisement
Google Ads BL

భీమ్లా నాయక్ పై మేకర్స్ క్లారిటీ


పవన్ కళ్యాణ్ - రానా కాంబోలో సాగర్ కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న భీమ్లా నాయక్ సినిమాపై విపరీతమైన అంచనాలున్నాయి. అయితే పవన్ కళ్యాణ్ క్రేజ్ తో భీమ్లా నాయక్ పై అంతకంతకు అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే భీమ్లా నాయక్ గా పవన్ లుక్, డ్యానియల్ శేఖర్ గా రానా లుక్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. భీమ్లా నాయక్ సినిమా జనవరి 12 -2022 సంక్రాతి కానుకగా రిలీజ్ చేస్తున్నట్టుగా మేకర్స్ ఎప్పుడో ప్రకటించారు. అయితే ఇప్పుడు భీమ్లా నాయక్ సంక్రాంతికి రిలీజ్ అవడం ఓకె.. కాని అది థియేటర్స్ లో కాదు, ఓటిటిలోనే భీమ్లా నాయక్ రిలీజ్ కాబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది.

Advertisement
CJ Advs

అది ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఈమధ్యన రిపబ్లిక్ ఈవెంట్ లో ఏపీ ప్రభుత్వం జగన్ పై, అలాగే మినిస్టర్స్ పై, ఇండస్ట్రీలో జగన్ కి మద్దతు తెలుపుతున్న పెద్దలపై ఘాటైన వ్యాఖ్యలు చెయ్యడంతో ఇప్పుడు పవన్ మీద కొందరు కావాలనే విషయం చిమ్ముతున్నారు. ఇప్పటికే తెలుగు ఫిలిం ఛాంబర్ వారు పవన్ వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదని, రెండు రాష్ట్ర ప్రభుత్వాల మద్దతు ఇండస్ట్రీకి అవసరం అంటూ లేఖ వ్రాసారు. అప్పటినుండి పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమా థియేటర్స్ లో విడుదల చేయనివ్వరు. ఇక ఓటిటిలోనే భీమ్లా నాయక్ రిలీజ్ అంటూ ప్రచారం చేస్తున్నారు. దానితో భీమ్లా నాయక్ మేకర్స్ లైన్ లోకొచ్చేసారు. 

భీమ్లా నాయక్ పై వస్తున్న రూమర్స్ ని నమ్మకండి, భీమ్లా నాయక్ ని జనవరి 12 న థియేటర్స్ లోనే రిలీజ్ చేస్తాము.. ఓటిటిలో ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ చెయ్యము.. గాలి వార్తలు నమ్మకండీ అంటూ భీమ్లా నాయక్ నిర్మాత నాగవంశీ భీమ్లా నాయక్ పై వస్తున్న రూమర్స్ ని ఖండించారు. 

Bheemla Nayak on 12th January in theaters:

Pawan and rana Bheemla Nayak on 12th January in theaters
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs