Advertisement
Google Ads BL

నామినేషన్స్ కూడా లీకయ్యాయి బాస్


బిగ్ బాస్ మొదలైనప్పటినుండి బుల్లితెర ప్రేక్షకులు బిగ్ బాస్ ని తెలుగులో బాగానే ఆదరిస్తున్నారు. నార్త్ అంత కాకపోయినా.. సౌత్ బిగ్ బాస్ కి కూడా మంచి ఆదరణే లభిస్తుంది. అయితే బిగ్ బాస్ లో గత మూడు సీజన్స్ నుండి లీకులు ఎక్కువైపోయాయి. బిగ్ బాస్ తెలుగు లో ఎప్పటికప్పుడు లీకులు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఆదివారం ఎలిమినేట్ అయ్యే విషయం ముందు రోజే లీకైపోతుంది. బిగ్ బాస్ యాజమాన్యం ఎంతగా ట్రై చేస్తున్నా ఈ లీకులకి అడ్డుకట్ట వెయ్యలేకపోతుంది. ఇక తాజాగా సోమవారం నామినేషన్స్ ప్రక్రియ కూడా లీకైపోయినట్లుగా తెలుస్తుంది.

Advertisement
CJ Advs

శని, అది, సోమవారాలు బిగ్ బాస్ కి గట్టి ఎపిసోడ్స్. శని, ఆది వారాల్లో నాగార్జున వస్తాడు కాబట్టి జనాల్లో క్యూరియాసిటీ ఉంటుంది. సోమవారం మాత్రం నామినేషన్స్ ప్రక్రియ హాట్ హాట్ గా సాగుతుంది. అంటే నామినేషన్స్ చేసేటప్పుడు ఒక్కొక్కళ్లు ఫైట్ చేసుకునేంత. గత వారం బిగ్ బాస్ 5 హౌస్ లో ఎంత రచ్చ జరిగిందో తెలిసిందే. ఇక ఈ రోజు రాత్రి జరగబోయే నామినేషన్స్ ప్రక్రియని బిగ్ బాస్ ప్రోమో వదిలింది స్టార్ మా. అంతకు ముందే ఈ రోజు నామినేషన్స్ లోకి వెళ్లిన సభ్యుల లిస్ట్ లీకైపోయింది. ఈ రోజు నామినేషన్స్ లో ఏకంగా ఎనిమిది మంది ఉన్నారు. అందులో లోబో, సన్నీ, కాజల్, సిరి, ఆని మాస్టర్, నటరాజ్ మాస్టర్, యాంకర్ రవి, ప్రియాలు నామినేషన్స్ లో ఉన్నట్లుగా తెలుస్తుంది. మరి ఇలాంటి లీకుల వలన బిగ్ బాస్ కి ఫుల్ డ్యామేజీ జరగడం తథ్యం.

Nominations have also been leaked from Bigg Boss:

Bigg Boss 5 leaks Continue
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs