Advertisement
Google Ads BL

కొండపొలం ట్రైలర్ రివ్యూ


ఉప్పెన లాంటి బ్లాక్ బస్టర్ చిత్రం తరువాత మెగా సెన్సేషన్ వైష్ణవ్ తేజ్ రెండో చిత్రం కొండపొలంతో మరోసారి అందరినీ మెస్మరైజ్ చేసేందుకు రెడీ అయ్యారు. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ సరసన రకుల్ ప్రీత్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్  ఫస్ట్ లుక్‌‌ పోస్టర్స్ కి  మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఇటీవల విడుదల చేసిన ఓబులమ్మ... ఫస్ట్ సాంగ్ తో  కీరవాణి తన మార్క్‌ను చూపించారు దాంతో కొండపొలం ఆడియోపైనా అందరికీ అంచనాలు పెరిగిపోయాయి. ఇక సోమవారం నాడు ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్. ఈ ట్రైలర్‌లో  సినిమా కథ ఏంటి? దేని గురించి చెప్పబోతోన్నారనే క్లారిటీని ఇచ్చారు. ట్రైలర్‌ను చూస్తుంటే కచ్చితంగా ప్రేక్షకులను ఆకట్టుకునే సినిమాగా ఉండబోతోందనిపిస్తోంది.

Advertisement
CJ Advs

హైద్రాబాద్‌లో ఉద్యోగ వేటలో ఎన్నో ఇంటర్వ్యూలు ఇవ్వడం, అక్కడ అతనికి అవమానాలు ఎదురవడం కనిపిస్తోంది. ఆయన కుటుంబ నేపథ్యం, గొర్రెల కాపరి కావడం, తల్లిదండ్రులు చదువుకోకపోవడం వంటి కార‌ణాల‌ను లేవనెత్తి కించపరుస్తుంటారు. కానీ ఆ వృత్తినే ఎంతో గర్వంగా చెప్పుకుంటాడు. నల్లమల అడవులన్నీ నాకు తెలుసు..ఇక నేను ఎక్కడకి వెళ్లను..అదే నా ఇన్‌స్టిట్యూషన్ అని ఫిక్స్ అవుతాడు. కటారు రవింద్ర యాదవ్ (వైష్ణవ్ తేజ్) తన తాత మాట ప్రకారం.. తండ్రితో కలిసి కొండపొలం అనే ఊరికి వెళ్తాడు. అక్కడ నీటి వసతి ఉండదు. కానీ అక్కడే  మేకలు, గొర్రెలను పెంచాలి. క్రూర మృగాల నుంచి వాటిని కాపాడే బాధ్యతను అతను తీసుకుంటాడు. ఇక అక్కడే అతని ప్రేయసి ఓబులమ్మ ప‌రిచ‌య‌మ‌వుతుంది. అడవిలోని క్రూర మృగాల కంటే ఘోరమైన, దారుణమైన మనుషులుంటారు. వారి వల్ల రవీంద్ర ప్రయాణం ఎంతో కష్టంగా మారుతుంది. వారి నుంచి ఎన్నో ప్రమాదాలు ఎదురవుతుంటాయి. వారితో రవీంద్రకు ఎదురైన పరిస్థితులు ఏంటి? వాటి నుంచి ఎలా తప్పించుకున్నాడు అనేదే కథ.

కొండపొలం స్టోరీ లైన్ ఎంతో ఆసక్తికరంగా ఉంది. ఇలాంటి సబ్జెక్ట్‌ను మరింత ఆసక్తికరంగా మార్చడంలో క్రిష్ నైపుణ్యం అందరికీ తెలిసిందే. జ్ఞాన శేఖర్ తన కెమెరాతో అద్బుతమైన దృశ్యాలను చూపించారు. ఎంఎం కీరవాణి నేపథ్య సంగీతం అందరికీ గుర్తుండిపోయేలా ఉంది. వైష్ణవ్ తేజ్‌కు ఈ పాత్ర సరిగ్గా సరిపోయింది. ఇక రకుల్ ప్రీత్ సింగ్ ఎంతో అందంగా కనిపించింది. ఈ జంట చూడటానికి ఎంతో ఫ్రెష్‌గా, కొత్తగా ఉంది. కొండపొలం చిత్రం అక్టోబర్ 8న భారీ స్థాయిలో విడుదల కాబోతోంది.

Vaisshnav Tej Konda Polam Trailer Out:

<span>Panja Vaisshnav Tej, Rakul Preet Singh, Krish and First Frame Entertainments Konda Polam Trailer Out</span>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs