Advertisement
Google Ads BL

పవన్ పంచ్ - మోహన్ బాబు రియాక్షన్


గత రాత్రి అంటే శనివారం రాత్రి రిపబ్లిక్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం జగన్ ని ఉద్దేశించి, ఇండస్ట్రీ పెద్దల గురించి మాట్లాడిన మాటలు టాలీవుడ్ ని, ఏపీని షేక్ చేస్తున్నాయి. రాజకీయ వేదిక మీద మాట్లాడిల్సిన మాటలను ఓ పబ్లిక్ ఈవెంట్ లో మట్లాడడం అనేది పవన్ కి కరెక్ట్ కాకపోయినా.. పవన్ మాట్లాడింది అక్షర సత్యం. ఇది వైసీపీ రిప‌బ్లిక్ అని కాదు.. ఇండియ‌న్ రిప‌బ్లిక్ అని చెప్పండి. అధికారం ఉంది క‌దా.. అని పిచ్చి వేషాలు వేస్తే.. భ‌విష్య‌త్ ఉండ‌దు. క‌రోనా స‌మ‌యం వ‌ల్ల సినిమా ఇండ‌స్ట్రీ ఇబ్బందుల‌ను ఎదుర్కొంటుంది. సెన్సిటివ్ ప‌రిశ్ర‌మ . ఎవ‌రికైనా ఈజీ టార్గెట్ సినిమా ప‌రిశ్ర‌మ‌. వెల్త్ క్రియేష‌న్ జ‌ర‌గాలిరా స‌న్నాసుల్లారా!. డ‌బ్బులు సంపాదించేస్తున్నారు అనే స‌న్నాసుల‌కు ఒక‌టే చెబుతున్నా. నా పేరు చెప్పి ఫిల్మ్ ఇండ‌స్ట్రీని చావ దొబ్బేస్తున్నారు. చిత్ర పరిశ్ర‌మ వైపు క‌న్నెత్తి చూడ‌కండి.. కాలిపోతారు జాగ్ర‌త్త‌. మీరు ల‌క్ష కోట్లు సంపాదించొచ్చు. మేం అడుక్కుతినాలా?  వైసీపీ నాయ‌కుల‌కు ఇండ‌స్ట్రీ వైపు చూడ‌కండి అని మీరు చెప్పాలేరా?  మాట్లాడండి. ఏం చేస్తారు  నా పేరు చెప్పి ఫిల్మ్ ఇండ‌స్ట్రీని చావ దొబ్బేస్తున్నారు. చిత్ర పరిశ్ర‌మ వైపు క‌న్నెత్తి చూడ‌కండి.. కాలిపోతారు జాగ్ర‌త్త‌. 

Advertisement
CJ Advs

చిత్ర ప‌రిశ్ర‌మ‌కు అక్క‌ర‌కు రాని సోద‌ర భావ‌న ఎందుకు?  వెళ్లి దిబ్బ‌లో కొట్టుకోవ‌డానికా!. సినిమా టిక్కెట్ల‌ను ఆంధ్ర ప్ర‌భుత్వం ఎందుకు తీసుకోవాల‌నుకుంటుందంటే వాళ్ల ద‌గ్గ‌ర డ‌బ్బులు లేవు. చిత్ర ప‌రిశ్ర‌మ మీద వ‌చ్చే ఆదాయాన్ని బ్యాంకుల‌కు చూపించ‌వ‌చ్చు. లోన్స్ తెచ్చుకోవ‌చ్చు. దాని కోస‌మే టికెట్స్ అమ్మ‌కాన్ని తీసుకుంటున్నారు. వైసీపీ ప్ర‌భుత్వం థియేట‌ర్స్ విష‌యంలో ఇబ్బంది పెడ‌తారు. చిరంజీవిగారిలాంటి వ్య‌క్తుల‌కు చెప్పండి ప్రాధేప‌డొద్ద‌ని. హ‌క్కుతో మాట్లాడ‌మ‌ని చెప్పండి. సినీ పెద్ద‌లు, సంపూర్ణ విద్వాంసులు బ‌య‌ట‌కు రండి. ఖండించండి. తప్ప‌ని చెప్పండి. చిత్ర ప‌రిశ్ర‌మ వైపు ఆంధ్ర ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం తీరు మార‌క‌పోతే, మీరు మార్చేలా ఎలా చేయాలో మాకు తెలుసు.. అంటూ కాస్త ఘాటుగా మాట్లాడాడు. 

దానితో మోహన్ బాబు పవన్ చేసిన వ్యాఖ్యలకు ధీటుగా ఓ ట్వీట్ వేసాడు. 

నా చిరకాల మిత్రుని సోదరుడైన పవన్ కళ్యాణ్ నువ్వు నాకంటే చిన్నవాడివి అందుకని ఏకవచనంతో సంబోధించాను.

వవన్ కళ్యాణ్ గారు అనడంలో కూడా తప్పేమిలేదు.

చాలా కాలానికి నన్ను మెల్లగా లాగావ్, సంతోషమే.

ఇప్పుడు మా ఎలక్షన్స్ జరుగుతున్నాయి.

నా కుమారుడు విష్ణు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా నిలబడ్డాడు అన్న సంగతి నీకు తెలిసిందే.

అక్టోబర్ 10వ తేదీన ఎలక్షన్స్ అయిపోతాయి.

ఆ తర్వాత నువ్వు అడిగిన ప్రతిమాటకి నేను హృదయపూర్వకంగా సమాధానం చెబుతాను.

ఈలోగా నువ్వు చేయవలసిన ముఖ్యమైన పని...

నీ అమూల్యమైన ఓటుని నీ సోదర సమానుడైన విష్ణుబాబుకి, అతని ప్యానల్ కి వేసి వాళ్ళని గెలిపించాలని కోరుకుంటున్నాను.

థ్యాంక్యూ వెరీమచ్..

మోహన్ బాబు

Pawan Kalyan Punch - Mohan Babu Tweet:

Mohan Babu responds to Pawan Kalyan Comments
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs