Advertisement
Google Ads BL

ఆ పార్టీలో సమంత మిస్సింగ్


సమంత - నాగ చైతన్య ఈ రెండు పేర్లు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిన పేర్లు. సినిమాల పరంగా నాగ చైతన్య లవ్ స్టోరీ హిట్ కొడితే.. సమంత శాకుంతలం షూట్ పూర్తి చేసి పర్సనల్ ట్రిప్ కి వెళ్ళింది. మధ్యలో చైతు - సమంత లు విడాకులు తీసుకోబోతున్నారనే మేటర్ హైలెట్ అవుతుంది. నాగ చైతన్య కానీ, సమంత కానీ స్పందించరు. మీడియా లో మాత్రం వీళ్ళ డివోర్స్ మేటర్ చిలవలు పలవలు తొడుక్కుంటూ పోతుంది. ఆఖరికి విడాకుల తీసుకుంటున్న సమంత.. అక్కినేని ఫ్యామిలీ నుండి భరణంగా కింద కోట్లు పట్టుకుపోతుందనే న్యూస్ కూడా మొదలయ్యింది. 

Advertisement
CJ Advs

ఇక సమంత ఈ విషయాన్ని మరింతగా పెద్దది చేసింది అనిపిస్తుంది. అంటే మొన్న నాగ్ బర్త్ డే కి విష్ చేసిన సమంత.. తర్వాత వాళ్ళ ఇంట్లో పార్టీలో కనిపించలేదు. ఇక తాజాగా లవ్ స్టోరీ సక్సెస్ పార్టీని నాగార్జున తన ఇంట్లోనే ఇచ్చాడు. ఈ పార్టీకి అమీర్ ఖాన్ హాజరవడం హాట్ టాపిక్ అయితే.. ఈ పార్టీలో సమంత మిస్ అవడం మరింత హాట్ టాపిక్ అయ్యింది. అఖిల్, నాగ్, నాగ చైతన్య, సాయి పల్లవి, శేఖర్ కమ్ముల, అమీర్ ఖాన్ అందరూ ఉన్నా సమంత కనిపించకపోయే సరికి వాళ్ళ విడాకుల మేటర్ మరింత స్ట్రాంగ్ గా తయారయ్యింది. మరి సమంత ఈ పార్టీకి ఎందుకు హాజరవలేదో కానీ.. ఇప్పడు టాలీవుడ్ లో ఇదే ముచ్చట చర్చకు దారితీసింది. అక్కినేని కుటుంబంతో ఉన్న విభేదాల కారణంగానే ఆ పార్టీకి సమంత రాలేదనే వార్తలు హైలెట్ అవుతున్నాయి.

Why was Samantha Akkineni absent from special dinner Party:

Was Samantha missing from Love Story Success Party 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs