Advertisement
Google Ads BL

వరుడు కావలెను రిలీజ్ డేట్ ఫిక్స్


నిన్న థియేటర్స్ లో ప్రేక్షకుల సందడి చూసిన నిర్మాతలు తమ సినిమాల రిలీజ్ డేట్స్ ని ప్రకటించడానికి రెడీ అయ్యారు. అందులో ముందుగా నాగ శౌర్య వరుడు కావలెను మేకర్స్ చాలా త్వరగా తమ రిలీజ్ డేట్ ని ప్రకటించారు. అందరూ లవ్ స్టోరీ కలెక్షన్స్ పైన, థియేటర్స్ లో లవ్ స్టోరీ ని చూసేందుకు వచ్చే ప్రేక్షకులపైనే దసరాకి రిలీజ్ కాబోయే సినిమాల భవిష్యత్తు అంటున్నారు. ఇక నిన్న విడుదలయిన లవ్ స్టోరీ సూపర్ హిట్ టాక్ తో సూపర్ హిట్ కలెక్షన్స్ తో బిగ్గెస్ట్ ఓపెనర్ గా నిలవడంతో.. వరుడు కావలెను మేకర్స్ హడావిడిగా తమ సినిమాని అక్టోబర్15 న దశారా కానుకగా రిలీజ్ చెయ్యబోతున్నట్టుగా ప్రకటించారు. 

Advertisement
CJ Advs

నాగ శౌర్య - రీతూ వర్మ జంటగా దర్శకురాలు లక్ష్మి సౌమ్య బ్యూటిఫుల్ లవ్ స్టోరీగా తెరకెక్కించిన వరుడు కావలెను సినిమా టీజర్, అలాగే సాంగ్స్ ఆకట్టుకునేలా ఉండడంతో సినిమాపై ప్రేక్షకుల్లోనూ, ట్రేడ్ లోను మంచి క్రేజ్ వచ్చేసింది. ఇక ఈ దసరా బరిలో మహాసముద్రం అక్టోబర్ 14 రిలీజ్ అవుతుంటే.. ఆ నెక్స్ట్ డే విజయదశమికి నాగ శౌర్య వరుడు కావలెను రిలీజ్ అవుతుంది. సో ఈ దసరా మరింత కలర్ ఫుల్ గా మారిపోయింది. ఈ రేస్ లో అంటే దసరాకి ఇంకెన్ని సినిమాలు తమ తమ రిలీజ్ డేట్స్ తో దిగుతాయో చూడాలి. 

 

Varudu Kavalenu announces its arrival:

Varudu Kavalenu slated for Dasara release  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs