నాగార్జున - కళ్యాణ్ కృష్ణ కాంబోలో రీసెంట్ గా మొదలైన బంగ్గార్రాజు సినిమా షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జోరుగా చిత్రీకరణ జరుపుకుంటుంది. నాగార్జున బంగార్రాజు గా పంచె కట్టులో అదరగొట్టేస్తున్నాడు. అదే ఆయన భార్య గా రమ్యకృష్ణ అదిరిపోయే లుక్ లో కనిపిస్తుంది. ఇక ఈ సినిమాలో మరో కీలక పాత్ర నాగ చైతన్య పోషిస్తున్నాడు. చైతు కి జోడిగా ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి నటిస్తుంది. ఇప్పటికే రమ్యకృష్ణ, కృతి శెట్టిలు హీరోయిన్స్ గా ఫైనల్ అయ్యారు.
ఈ సినిమాలో రంభ, ఊర్వశి, మేనకా పాత్రలకు మరింతమంది హీరోయిన్స్ అవసరం ఉంది అని, దేవలోకంలో నాగార్జున రంభ, ఉర్వశి, మేనకలతో డ్యూయెట్ మాత్రమే కాదు.. కొన్ని సన్నివేశాలు కూడా ఉండబోతున్నాయట. ఇప్పటికే రంభ పాత్రకి బిగ్ బాస్ బ్యూటీ మోనాల్ గజ్జర్ ని తీసుకోగా.. మిగతా ఊర్వశి, మేనకా కేరెక్టర్స్ కి మీనాక్షి చౌదరి, వేదికను ఎంపిక చేసినట్లుగా తెలుస్తుంది. అంటే బంగార్రాజులో మొత్తంగా ఐదురు భామలు కనిపిస్తారట. బంగార్రాజు సినిమా మొత్తం గ్లామర్ చుట్టూనే తిరగబోతుంది అని అంటున్నారు. ఓరి వాడి తస్సాదియ్యా అంటూ నాగ్ ఎంతమంది భామలతో డాన్స్ చేస్తాడో చూద్దాం.