Advertisement
Google Ads BL

లవ్ స్టోరీకి బిగ్ షాక్


నాగ చైతన్య - సాయి పల్లవి కాంబోలో శేఖర్ కమ్ముల తెరకెక్కించిన లవ్ స్టోరీ మూవీ నేడు థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది. ఓవర్సీస్ దగ్గర నుండి.. రెండు తెలుగు రాష్ట్రాల వరకు లవ్ స్టోరీ బాక్సాఫీసు వద్ద ప్రేక్షకుల సందడి చూస్తే థియేటర్స్ కి మళ్ళీ పూర్వ వైభవం వచ్చేసింది అనుకుంటున్నారు. మూడు రోజుల ముందు నుండే బుక్ మై షో లో లవ్ స్టోరీ బుకింగ్స్ జోరుగా సాగాయి. సినిమా రిలీజ్ అయ్యాక సోషల్ మీడియాలో పాజిటివ్ టాక్, క్రిటిక్స్ పాజిటివ్ రివ్యూస్ తో లవ్ స్టోరీ పై మరింత ఆసక్తి జనాల్లో పెరిగిపోయింది. నాగ చైతన్య - సాయి పల్లవి పెరఫార్మెన్స్, మ్యూజిక్ అండ్ సినిమాటోగ్రఫీకి 100 కి 100 మార్కులు వేస్తున్నారు ప్రేక్షకులు.

Advertisement
CJ Advs

అంతటి ఘన విజయం సాధించిన లవ్ స్టోరీకి లీకుల రాయుళ్లు భారీ షాక్ ఇచ్చారు. ఏ సినిమా రిలీజ్ అయినా క్షణాల్లో లీకైపోవడం చూస్తున్నాం. మొన్నటికి మొన్న టక్ జగదీశ్, మ్యాస్ట్రో మూవీస్ ఓటిటిలో రిలీజ్ అయినా లీకుల రాయుళ్లు వదల్లేదు. సినిమా HD ప్రింట్ ని లీక్ చేసిపారేసారు. తాజాగా లవ్ స్టోరీ రిలీజ్ అయిన కొద్దీ గంటలకే HD క్వాలిటీ తో మూవీ రూల్స్, ఐ బొమ్మ వంటి కొన్ని వెబ్ సైట్ లలో లీకవడం అందరికీ షాక్ ఇస్తోంది. దానితో షాకయిన అక్కినేని ఫాన్స్.. ఆన్ లైన్ లో లవ్ స్టోరీ ప్రింట్ కనబడగానే కంప్లైంట్ చెయ్యండి ప్లీజ్ అంటూ రిక్వెస్ట్ లు పెడుతున్నారు. 

Big shock to the Love Story Movie:

Big shock to the Love Story team
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs