బిగ్ బాస్ సీజన్ 5 స్టార్ట్ అయినప్పటినుండి.. చాలా చప్పగా సాగుతుంది. కంటెస్టెంట్స్ ఎవరి గేమ్ వాళ్ళు ఆడేస్తూ బుల్లితెర ప్రేక్షకులని వెర్రి వాళ్ళని చేస్తున్నారు. బిగ్ బాస్ కి పబ్లిక్ టాక్ మరీ వీక్ గా ఉంది. సీజన్ 4 తో పోలిస్తే ఈ సీజన్ నథింగ్ అనే మాట వినిపిస్తుంది. ఇక గత రాత్రి ఎపిసోడ్ లో కెప్టెన్సీ టాస్క్, అలాగే కంటెస్టెంట్స్ ఫస్ట్ లవ్ మీద స్పీచ్ సాగగా.. ఈ రోజు బెస్ట్ పెరఫార్మర్, వరెస్ట్ ప్రఫార్మర్ విషయంలో హౌస్ లో రచ్చ జరిగినట్టుగా ప్రమోస్ రిలీజ్ చేసింది స్టార్ మా.
అంతేకాకుండా హౌస్ లో ఓ బేబీ ఏడుపు వినపడగా.. బిగ్ బాస్ టివిలో నటరాజ్ మాస్టర్ భార్య సీమంతం వేడుకని చూపించింది. దానితో నటరాజ్ మాస్టర్ బాగా ఎమోషన్ అయ్యి టివి దగ్గరకి వెళ్లి భార్య ని ముద్దు పెట్టుకున్నాడు. నటరాజ్ మాస్టర్ తాను బిగ్ బాస్ హౌస్ కి వచ్చేటప్పటికీ భార్య ప్రెగ్నెంట్ అని, అయినా ధైర్యంతో తనని ఇక్కడికి పంపింది అని, లేదంటే తాను ఇప్పుడు భార్యతో ఉండేవాడిని అని చెప్పిన వెంటనే నటరాజ్ మాస్టర్ కి స్టార్ మా సర్ ప్రైజ్ ఇచ్చింది. భార్య సీమంతం చూడలేకపోయాననే నటరాజ్ మాస్టర్ బాధని స్టార్ మా ఇలా తీర్చేసింది అన్నమాట.