అక్టోబర్ 13 న రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ ని విడుదల చేస్తారు అని ఊరించి ఊరించి.. లేదండి.. వరల్డ్ వైడ్ గా థియేటర్స్ ఓపెన్ కాలేదు.. కాబట్టి ఆర్.ఆర్.ఆర్ ని పోస్ట్ పోన్ చేస్తున్నామంటూ ఫాన్స్ ని బాగా డిస్పాయింట్ చేసారు రాజమౌళి. అంటే దసరా కి ఆర్.ఆర్.ఆర్ రావడం లేదు. మరి ఎప్పుడు రిలీజ్ చేస్తారు? ఇప్పుడు ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్ ఫాన్స్ అడుగుతున్న ప్రశ్నకు రాజమౌళి ఏదో ఒక సమాధానం చెప్పాలి. కానీ రాజమౌళి ఇంకా వేచి చూస్తున్నారు కానీ.. ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇవ్వడం లేదు.
క్రిష్ట్మస్ కి డేట్ ఇవ్వండి ప్లీజ్.. లేదు అంటే.. సంక్రాంతికి డేట్ ఇచ్చెయ్యండి రాజమౌళి గారు.. అంటూ ఫాన్స్ రిక్వెస్ట్ లు పెడుతున్నారు. కొంతమంది సంక్రాంతి కాకపోతే వేసవికి ఆర్.ఆర్.ఆర్ షిఫ్ట్ అయ్యే ఛాన్స్ ఉంది అంటూ వార్తలు అల్లెయ్యడంతో ఇప్పుడు ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్ మరియు ఆర్.ఆర్.ఆర్ పాన్ ఇండియా ఫాన్స్ కంగారు పడుతున్నారు. రాజమౌళి ఇప్పటికైనా ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ పై క్లారిటీ ఇస్తే.. అందరూ ఆ డేట్ కి ఫిక్స్ అయ్యి కూల్ అవుతారు.