మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ అయినా, వైష్ణవ తేజ్ అయినా చిరంజీవికి, పవన్ కళ్యాణ్ కి, నాగబాబు కి వల్లమాలిన ప్రేమ. ఎందుకంటే వారు హీరోలయ్యాక వారి సినిమాలని సపోర్ట్ చెయ్యడం కానీ, వారి సినిమా కథలని ఫైనల్ చెయ్యడం కానీ చూస్తున్నాము. తాజాగా మెగా మేనల్లుడు ఓ రోడ్డు ప్రమాదంలో గాయాల పాలై హాస్పిటల్ కి చేరుకునేలోపే చిరు, పవన్ లు హాస్పిటల్ కి వచ్చేసి మేనల్లుడు ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. అపోలో లో ఓ నైట్ మొత్తం పవన్ కళ్యాణ్ పడిగాపులు పడ్డారు. ఇక సాయి తేజ్ నటించిన రిపబ్లిక్ రిలీజ్ కి రెడీ అవడం, సాయి తేజ్ ఇంకా హాస్పిటల్ లోనే ఉండడంతో ఇప్పుడు అల్లుడి సినిమా కోసం మేనమావలు రంగంలోకి దిగారు.
నిన్న చిరంజీవి సాయి తేజ్ కోలుకుంటున్నాడని, త్వరలోనే మనందరి ముందుకు ఆరోగ్యంతో తిరిగి వస్తాడని.. ఆయన నటించిన రిపబ్లిక్ ట్రైలర్ ని రిలీజ్ చెయ్యగా.. ఇప్పడు రిపబ్లిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం చిన్న మేనమావ పవన్ కళ్యాణ్ వస్తున్నాడు. ఈ నెల 25 న జరగబోయే రిపబ్లిక్ ఈవెంట్ కి వచ్చి మేనల్లుడి సినిమాని పవన్ కళ్యాణ్ ప్రమోట్ చెయ్యబోతున్నాడు. మరి మేనల్లుడు కోలుకునేవరకు ఆయన మావయ్యలు, చిరు, పవన్ లు సాయి తేజ్ కి ఎంతెలా అండగా నిలుస్తున్నారో కదా అంటూ మెగా ఫాన్స్ ముచ్చటపడిపోతున్నారు.