Advertisement
Google Ads BL

ఓవర్సీస్ లో లవ్ స్టోరీ హవా


రేపు ఈపాటికి థియేటర్స్ దగ్గర ప్రేక్షకుల హంగామా ఓ రేంజ్ లో ఉండడం ఖాయం. ఎందుకంటే  నాగ చైతన్య - సాయి పల్లవి కాంబోలో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రాబోతున్న లవ్ స్టోరీ పై ఎంతగా అంచనాలున్నాయో ఆ సినిమా టికెట్స్ అడ్వాన్స్ గా బుక్ అవుతున్న బుకింగ్స్ చూస్తే తెలిసిపోతుంది. ప్రేక్షకుల్లో ఈ సినిమాపై ఎంత క్రేజ్ ఉందొ.. ఇక లవ్ స్టోరీ మూవీ తో ఓవర్సీస్ లోను సినిమాల హవా మొదలు కాబోతుంది. సినిమా ఇండస్ట్రీకి అతిపెద్ద మార్కెట్ ఓవర్సీస్ మార్కెట్. కానీ కరోనా ఫస్ట్ వేవ్ దగ్గర నుడి సెకండ్ వేవ్ వరకు సినిమాలు ఓవర్సీసీలో విడుదల కావడం లేదు.. విడుదలైన సినిమాలు సత్తాను చూపలేకపోయాయి. ఎందుకంటే ఓవర్సీస్ ప్రేక్షకులు థియేటర్స్ వెళ్ళడానికి భయపడుతున్నారు కాబట్టి. దానితో కలెక్షన్స్ గండి పడుతుంది. ఒక్క జాతిరత్నాలే.. కరోనాని జయించింది. 

Advertisement
CJ Advs

ఇక శేఖర్ కమ్ముల సినిమాలకు ఓవర్సీస్ ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ఆయన సినిమాలకు అతి పెద్ద కలెక్షన్ తెచ్చిపెట్టేది ఓవర్సీస్ మార్కెట్టే. తాజాగా శేఖర్ కమ్ముల లవ్ స్టోరీ కి యుఎస్‌ఎలో అడ్వాన్స్ బుకింగ్స్ జోరు చూస్తుంటే మళ్ళీ సినిమాలకు అక్కడ మంచి రోజులు వచ్చినట్టే కనిపిస్తుంది. లవ్ స్టోరీ ప్రీ-బుకింగ్స్ ద్వారా అక్కడ ఇప్పటి వరకు $ 150k వసూలు చేసింది. టెక్సాస్ ($ 27,475), కాలిఫోర్నియా ($ 16,447), న్యూజెర్సీ ($ 10,161) మరియు వర్జీనియా ($ 9,572) వంటి అనేక ప్రాంతాలలో టికెట్స్ జోరుగా తెగుతున్నాయి. లవ్ స్టోరీ ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచగా.. శేఖర్ కమ్ముల కి మల్టిప్లెక్స్ ఆడియన్స్ నుండి ఉండే ఆదరణ ఈ ఓవర్సీస్ మార్కెట్ తో స్పష్టంగా కనిపిస్తుంది. 

Love Story sets Overseas box office on fire:

Love Story sets new benchmark
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs