బిగ్ బాస్ సీజన్ 5 మొదలయ్యాక వీక్ డేస్ లో ఎలాంటి క్రేజీ టాస్క్ లు కనిపించడం లేదు. సోమవారం నామినేషన్స్ ప్రక్రియ కాస్త ఇంట్రెస్టింగ్ గా గొడవలు అన్ని బుల్లితెర ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారు. కానీ మిగతా రోజులు లగ్జరీ బడ్జెట్ టాస్క్ లు, ఇంకా కెప్టెన్సీ టాస్క్ లు చూస్తుంటే బోర్ కొడుతున్నాయి. అందులోను నిన్న పూర్తయిన లగ్జరీ బడ్జెట్ టాస్క్ మరింత నీరసాన్ని తెప్పించింది. ఒక్కొక్కరు లవ్ ట్రాక్స్ వేసుకుంటూ అబ్బో టాస్క్ చెయ్యమంటే జీవించేసారు. కానీ అంతా చప్పగానే ఉంది.. ఎక్కడా ఆసక్తిని కలిగించలేదు.
ఇక కంటెస్టెంట్స్ కూడా నీరసంగానే కనిపించారు. లహరి, హమీదాలు గ్లామర్ గా కనిపించడానికి ట్రై చేస్తున్నారు. బిగ్ బాస్ కంటెంట్ కోసం కోసం పోటీ పడుతున్నట్టే కనిపిస్తున్నారు కానీ.. అది వర్కౌట్ అవ్వనట్టుగా అనిపిస్తుంది. ఇక బిగ్ బాస్ హౌస్ లో మసాలా కంటెంట్ తక్కువైంది అంటూ బుల్లితెర ప్రేక్షకులు ఫీలవుతున్నారు. కావాలని చేస్తున్న లవ్ ట్రాక్స్ కి బుల్లితెర ప్రేక్షకులు కనెక్ట్ కాలేకపోతున్నారు. అందుకే మసాలా కావాలని చూస్తున్నారు.