నాగ చైతన్య - సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ లవ్ స్టోరీ. ఈ సినిమా రేపు శుక్రవారమే థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా పై ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. అందుకే ఈ సినిమా అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ బాగా జోరుగా ఉన్నాయి. ఇప్పటికే మల్టిప్లెక్స్ ల్లో లవ్ స్టోరీ టికెట్ బుకింగ్స్ మూడు రోజులకి కళకళలాడుతున్నాయి. సాయి పల్లవి డాన్స్, నాగ చైతన్య - సాయి పల్లవి పెయిర్, శేఖర్ కమ్ముల మేకింగ్, సారంగా దారియా సాంగ్ వలన లవ్ స్టోరీ పై ప్రేక్షకుల్లో అంచనాలు పెరగడం, సెలబ్రిటీస్ లవ్ స్టోరీకి చేస్తున్న ప్రమోషన్స్ తో ఈ సినిమాపై ట్రేడ్ లోను, ప్రేక్షకుల్లోనూ మంచి క్రేజ్ వచ్చేసింది.
రేపు శుక్రవారం విడుదల కాబోతున్న లవ్ స్టోరీ క్లైమాక్స్ పై ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి బయటికి వచ్చింది. సినిమా ఫస్ట్ హాఫ్ అంతా.. క్యూట్ లవ్ స్టోరీ, సాయి పల్లవి డాన్స్, నాగ చైతన్య కామెడీ అన్ని హైలెట్ అనేలా ఉంటె.. సెకండ్ హాఫ్ మొత్తం శేఖర్ కమ్ముల ఎమోషన్స్ తో నడిపాడని.. అందులోను లవ్ స్టోరీ క్లైమాక్స్ డిఫ్రెంట్ గా ఉండబోతుంది అంటూ ఓ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా సర్క్యులేట్ అవుతుంది. లవ్ స్టోరీ క్లైమాక్స్ పరువు హత్య టైప్ లో పాజిటివ్ గా కాకుండా.. నెగెటివ్ గా ఉండబోతుంది అని, రెండు క్లైమాక్స్ లు రాసుకున్న శేఖర్ కమ్ముల నెగెటివ్ క్లైమాక్స్ కె మొగ్గు చూపాడని అంటున్నారు.
కానీ తెలుగు ప్రేక్షకులకి కథ సుఖంతమైతేనే కానీ.. దుఃఖంతమైతే తట్టుకోలేరు. శేఖర్ కమ్ముల తాను నమ్మిన ఫార్ములా పర్ఫెక్ట్ గా వర్కౌట్ అవడం ఖాయమని అంటున్నారట. చూద్దాం రేపు లవ్ స్టోరీ క్లైమాక్స్ ఎలాంటి సెన్సేషన్ సృష్టిస్తుందో అనేది.