Advertisement
Google Ads BL

కాజల్ ప్లేస్ లో ఇలియానా?


ఈమధ్యన కాజల్ అగర్వాల్ ప్రెగ్నెంట్.. ఓ ఏడాది సినిమాలకు బ్రేక్ ఇవ్వబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది. కొన్నాళ్లుగా కాజల్ ఈ విషయం చెప్పకుండా దాస్తోంది.. ఇప్పుడు మాత్రం కాజల్ సినిమా షూటింగ్స్ కి బ్రేక్ ఇచ్చెయ్యబోతుంది.. అందుకే ఆచార్య మూవీ షూటింగ్ కూడా చకచక ఫినిష్ చేసేసింది అనే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నా కాజల్ మాత్రం ఈ విషయమై ఎక్కడా స్పందించడం లేదు. ఇక నాగ్ - ప్రవీణ్ సత్తారు ఘోస్ట్ మూవీలో రా ఏజెంట్ గా నటించబోతున్న కాజల్ ఇప్పుడు ప్రెగ్నెన్సీ కారణంగా తప్పుకుందని అంటున్నారు. 

Advertisement
CJ Advs

ఆ ప్లేస్ లో గోవా బ్యూటీ ఇలియానా ని తీసుకోబోతున్నారనే న్యూస్ మొదలయ్యింది. ప్రస్తుతం గోవా బ్యూటీ ఇలియానా చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. అంటే బాయ్ ఫ్రెండ్ ఆండ్రు నుండి సపరేట్ అయ్యాక ఇలియానా డిప్రషన్ లోకి వెళ్లడం, రీ ఎంట్రీ ఆమెకి కలిసిరాకపోవడంతో ఇలియానా ఫీలవుతుంది. సౌత్ ఇండస్ట్రీపై అప్పుడప్పుడు సంచలన వ్యాఖ్యలు చేసే ఇలియానా ని టాలీవుడ్ ఎప్పుడో పక్కనపడేసింది. అయితే ఇప్పుడు నాగ్ - ప్రవీణ్ సత్తారు కాంబో ఘోస్ట్ మూవీకి కాజల్ ప్లేస్ లో ఇలియానాని తీసుకోబోతున్నారనే న్యూస్ మాత్రం తెగ ప్రచారం అవుతుంది. అందులో నిజమెంతుందో అనేది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. 

Ileana in Kajal Place?:

Ileana replace Kajal Agarwal place in Ghost movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs