Advertisement
Google Ads BL

ఎట్టకేలకు బయటికొచ్చిన రాజ్ కుంద్రా


జులై లో బ్లు ఫిలిమ్స్ కేసులో అరెస్ట అయ్యి ముంబై పోలీస్ ల అదుపులో ఉన్న శిల్పా శెట్టి భర్త, ప్రముఖ వ్యాపారవేత్త రాజ్ కుంద్రా.. అప్పటినుండి బెయిల్ కోసం శతవిధాలా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. రెండు నెలలపాటు పోలీసుల కస్టడీలో ఉన్న రాజ్‌కుంద్రాకు ఎట్టకేలకి నిన్న సోమవారం కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. గత ఫిబ్రవరిలోనే ముంబయి శివారులోని ఓ బంగ్లాలో అస్లీల చిత్రాల షూటింగ్‌ జరుగుతున్న విషయం తెలుసుకున్న పోలీస్ లు ఆ బంగ్లాపై రైడ్ చెయ్యగా.. అక్కడ గెహనా వసిష్ఠ తో సహా 11 మందిని ముంబై పోలీస్ లు అరెస్ట్ చేసారు. అప్పటి నుండి ఆ కేసుపై దృష్టిసారించిన ముంబై పోలీస్ లకి రాజ్ కుంద్రా నుండి కీలక ఆదారాలు దొరకడంతో జులై లో రాజ్ కుంద్రా అరెస్ట్ చేసారు. 

Advertisement
CJ Advs

పోలీస్ కష్టడీలో ఉన్న రాజ్ కుంద్రా కి ఈ కేసులో బెయిల్ ఇవ్వకుండా రెండు నెలల పాటు కోర్టు ముప్పుతిప్పలు పెట్టి ఎట్టకేలకు బెయిల్ మంజూరు చేసింది. నిన్న బెయిల్ మంజూరు చెయ్యగా.. నేడు జైలు నుండి రాజ్ కుంద్రా బయటికి వచ్చాడు. ఇక రాజ్ కుంద్రా ఫోన్‌, లాప్‌టాప్‌, హాట్‌డ్రైవ్‌ డిస్క్‌లను పరిశీలించామని.. వాటిల్లో మొత్తం 119 అస్లీల చిత్రాలను గుర్తించామని... రాజ్ కుంద్రా ఆ వీడియోలన్నింటినీ 9 కోట్లకు బేరం పెట్టినట్లు ముంబై పోలీస్ లు తెలిపారు.

Shilpa Shetty Husband Raj Kundra Gets Bail :

Businessman Raj Kundra Leaves Jail 2 Months After Arrest
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs