Advertisement
Google Ads BL

కృతి శెట్టి బర్త్ డే సెలెబ్రేషన్స్


సమ్మోహనం, వి చిత్రాల త‌ర్వాత  హీరో సుధీర్ బాబు, ద‌ర్శ‌కుడు మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేష‌న్లో రూపోందుతోన్న మూడో చిత్రం ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి. రొమాంటిక్ డ్రామాగా తెర‌కెక్కుతోన్న ఈ మూవీ ద‌ర్శ‌కుడు మోహ‌న్ కృష్ణ ఇంద్ర‌గంటి డ్రీమ్ ప్రాజెక్ట్. ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్‌గా న‌టిస్తోంది. ప్ర‌స్తుతం ఈ మూవీ షూటింగ్ హైద‌రాబాద్‌లో జ‌రుగుతుంది. అన్న‌పూర్ణ స్టూడియోస్‌లో వేసిన భారీ సెట్లో సాంగ్ షూట్ చేస్తున్నారు. ఈ రోజు హీరోయిన్ కృతి శెట్టి పుట్టిన‌రోజు కావ‌డంతో లొకేష‌న్ లోనే కృతిశెట్టి బ‌ర్త్‌డే వేడుక‌లు ఘ‌నంగా జ‌రిపారు చిత్ర యూనిట్‌. ఈ కార్య‌క్ర‌మంలో ఎంటైర్ టీమ్ పాల్గొంది.

Advertisement
CJ Advs

గాజుల ప‌ల్లి సుధీర్‌బాబు స‌మ‌ర్ఫ‌ణ‌లో బెంచ్ మార్క్ స్టూడియోస్ ప‌తాకంపై బి. మ‌హేంద్ర‌బాబు, కిర‌ణ్ బ‌ల్ల‌ప‌ల్లి  ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వివేక్ సాగ‌ర్ సంగీతం అందిస్తుండ‌గా పీజీ విందా సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఆర్ట్ డైరెక్ట‌ర్ ర‌వీంద‌ర్‌, ఎడిట‌ర్ మార్తాండ్ కె. వెంక‌టేష్‌. సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి, రామ‌జోగ‌య్య శాస్త్రి సాహిత్యం అందిస్తున్నారు. అవ‌స‌రాల‌ శ్రీ‌నివాస్, వెన్నెల కిషోర్ ముఖ్య పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

Krithi Shetty Birthday Celebrations at Aa Ammayi Gurinchi Meeku Cheppali movie sets :

Krithi Shetty Birthday Celebrations
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs