Advertisement
Google Ads BL

మంత్రి పేర్ని తో భేటీ అయిన ప్రముఖులు వీరే


ఏపీ మంత్రి పేర్ని నానితో ఈరోజు సోమవారం ఉదయం 11 గంటలకు టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు భేటీ అయ్యారు. చిరు, నాగ్, సురేష్ బాబు ఈ మీటింగ్ కి దూరంగా ఉన్నారు. ఇక ఈ సమావేశంలో ప్రముఖ నిర్మాతలు దిల్‌రాజు, డీవీవీ దానయ్య, సి.కల్యాణ్‌, డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ల యజమానులు పాల్గొన్నారు. ఈ భేటీ లో ఆన్‌లైన్‌ టిక్కెట్ల వ్యవహారంపై ఈ సమావేశంలో ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

Advertisement
CJ Advs

ఇక నిన్న జరిగిన లవ్ స్టార్ అన్ ప్లగ్డ్ ఈవెంట్ లో టాలీవుడ్ ఇండస్ట్రీని రెండు రాష్ట్రాలప్రభుత్వాలు ఆదుకోవాలంటూ మెగాస్టార్ చిరంజీవి విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. ఇండస్ట్రీలో అధిక పారితోషకాలు తీసుకుంటున్నారు అనడంలో ఏ మాత్రం నిజం లేదని.. ఎక్కడో నలుగురైదుగురు మాత్రమే అధిక పారితోషకాలు తీసుకుంటున్నారని.. వారి కోసం మిగతా వారిని ఇబ్బంది పెట్టొద్దు అని, ఏపీ ప్రభుత్వంతో పాటుగా కేసీఆర్ ప్రభుత్వం కూడా చిత్ర పరిశ్రమను కనికరించాలని, తమ అభ్యర్థనను మన్నించాలని చిరు కోరిన నేపథ్యంలో మంత్రి తో జరుగుతున్న మీటింగ్ ప్రాధాన్యం సంతరించుకుంది.

Ap Minister Perni Nani Meeting With Elders Of Tollywood Movie Industry:

Ap Minister Perni Nani Meeting With Tollywood Movie Industry
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs