Advertisement
Google Ads BL

ఆ కేసులో వారంతా సేఫ్


2017 లో డ్రగ్స్ కేసులో ఓ 12 మంది సెలబ్రిటీస్ ఎక్సైజ్‌ అధికారుల ముందు విచారణకు హాజరయ్యారు. అప్పట్లో పూరి, రవితేజ, సుబ్బరాజు, ఛార్మి, నందు, నవదీప్, తనీష్, తరుణ్ ఇంకొంతమంది సెలబ్రిటీస్ ఎక్సైజ్‌ అధికారుల ముందు విచారణకు హాజరు కాగా.. అప్పట్లో కొంతమంది నుండి డ్రగ్స్ నమూనాల సేకరణ కోసం గోళ్లు, వెంట్రుకలు, బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నారు. వారిలో పూరి, తరుణ్ లు స్వచ్చందంగా తమ బ్లడ్ శాంపిల్స్ ని ఎక్సైజ్‌ అధికారులకి ఇచ్చారు. దీనిపై గతేడాది డిసెంబరు 8న ఎఫ్ ఎస్‌ఎల్‌ నివేదికలు సమర్పించినట్టు ఎక్సైజ్‌శాఖ తెలిపింది.

Advertisement
CJ Advs

అయితే తాజాగా పూరి జగన్నాథ్‌, తరుణ్‌ నుంచి రక్తం, గోళ్లు సేకరించిన నమూనాల్లో డ్రగ్స్‌ ఆనవాళ్లు లేవని ఎఫ్ఎస్‌ఎల్‌ నివేదికలో తేలింది. పూరి జగన్నాధ్, తరుణ్‌కు సంబంధించిన రక్తం, వెంట్రుకలు, గోళ్లను పరీక్షించిన రాష్ట్ర ఫోరెన్సిక్‌ లేబొరేటరీ ఈమేరకు నివేదిక విడుదల చేసింది. మరి డ్రగ్స్ ఆనవాళ్లు లేకపోతె ఈ కేసులో పూరి అండ్ తరుణ్ లు సేఫ్ అయినట్లే అనిపిస్తుంది. ఇక నవదీప్, ఛార్మి లాంటి వాళ్ళు అప్పట్లో బ్లడ్ శాంపిల్స్ ఇవ్వడానికి నిరాకరించిన ట్లుగా వార్తలొచ్చాయి. ఇప్పుడు ఆ 12 మందికి ఎక్సైజ్‌ అధికారులు క్లీన్ చిట్ ఇవ్వడం హాట్ టాపిక్ అయ్యింది. ఇక ప్రస్తుతం మనీ లాండరింగ్ కేసులో పూరి దగ్గర నుండి ఛార్మి, రానా, రకుల్, నవదీప్ తదితరులు ఈడీ విచారణకు హాజరవుతున్న విషయం తెలిసిందే. 

Tollywood celebs get clean chit in Drugs case:

Tollywood drugs case: Clean chit for 16 people
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs