Advertisement
Google Ads BL

బిగ్ బాస్ స్టేజ్ పై రామ్ చరణ్, నితిన్


ఈ రోజు శనివారం అంటే.. బిగ్ బాస్ స్టేజ్ పై నాగార్జున కనిపించేరోజు. శని, ఆదివారాల్లో బుల్లితెర ప్రేక్షకులని అలరించడానికి వచ్చేస్తున్నాడు మన్మధుడు నాగ్. వీక్ డేస్ లో బిగ్ బాస్ కాస్త నీరసంగా ఉన్నప్పటికీ.. శని, ఆదివారాల్లో నాగార్జున హోస్ట్ చేస్తూ బిగ్ బాస్ ని వేరే లెవల్ కి తీసుకువెళతారు. శనివారం బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్స్ చేసే అల్లరిపై కోపం చూపించే నాగార్జున ఆదివారం హౌస్ నుండి ఓ కంటెస్టెంట్స్ ని ఎలిమినేట్ చెయ్యడం చూస్తూనే ఉంటాము. ఇక గత ఏడాది కరోనా కారణముగా హౌస్ లోకి వెళ్లడం కానీ, సినిమాల ప్రమోషన్స్ కానీ జరగలేదు. లేదంటే బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి సినిమాల ప్రమోషన్స్ చేసుకునేవారు. 

Advertisement
CJ Advs

ఇక ఈ ఏడాది బిగ్ బాస్ మొదలై 14 రోజులు గడుస్తున్నాయి. అయితే ఈసారి బిగ్ బాస్ స్టేజ్ మీద మూవీ ప్రమోషన్స్ స్టార్ట్ చేసారు. ఈ శనివారం డిస్ని ప్లస్ హాట్ స్టార్ కి బ్రాండ్ అంబాసిడర్ గా మారిన రామ్ చరణ్, అలాగే మ్యాస్ట్రో మూవీ తో హిట్ కొట్టిన నితిన్ - తమన్నా లు బిగ్ బాస్ స్టేజ్ పై సందడి చేసారు. రామ్ చరణ్, నితిన్, తమన్నా లతో నాగార్జున బిగ్ బాస్ స్టేజ్ పై ఉన్న పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నభ నటేష్ - నితిన్ - తమన్నాలు రొమాంటిక్ గా కనిపిస్తుండగా.. రామ్ చరణ్ స్పెషల్ గెస్ట్ గా బిగ్ బాస్ స్టేజ్ కె అందాన్ని తెచ్చారు. మరి పిక్ చూస్తూంటేనే అంత మైమరచిపోతుంటే.. ఈ రోజు రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్ ఇంకెంత ఇంట్రెస్టింగ్ గా ఉంటుందో చూడాలి. 

Ram Charan, Nithin inf Bigg Boss 5:

Ram Charan and Maestro team in the house of Bigg Boss 5
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs