హాట్ స్టార్ - సువర్ణభూమి తో రామ్ చరణ్


హీరోలంతా ఓ పక్క సినిమాలు మరోపక్క పలు బ్రాండ్స్ కి బ్రాండ్ అంబాసిడర్లు గా రెండు చేతులా ఆర్జిస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ అయితే సినిమాల సంగతి ఎలా ఉన్నా.. పలు ప్రోడక్ట్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా కోట్లు వెనకేస్తున్నాడు. అలాగే అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి హీరోలు ఇలా కొన్ని కంపెనీ యాడ్స్ లో నటిస్తూ చేతినిండా సంపాదనతో దూసుకుపోతున్నారు. తాజాగా ఆర్.ఆర్.ఆర్ హీరో రామ్ చరణ్ ఒకేసారి రెండు కంపెనీ లకు బ్రాండ్ అంబాసిడర్ గా చెయ్యడం ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యింది. అటు హీరోగానూ, ఇటు నిర్మాతగానూ ఫుల్ బిజీ చరణ్. 

ఆయన నటించిన ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ కి రెడీ అంటుంటే.. కోలీవుడ్ దర్శకుడు శంకర్ తో మరో మూవీ మొదలు పెట్టేసాడు రామ్ చరణ్. తాజాగా సువర్ణ భూమి రియల్ ఎస్టేట్ కి బ్రాండ్ అంబాసిడర్ గా మారాడు. మరోపక్క ప్రముఖ ఓటిటి సంస్థ డిస్ని ప్లస్ హాట్ స్టార్ కి బ్రాండ్ అంబాసిడర్ అవతారమెత్తాడు. డిస్ని ప్లస్ హాట్ స్టార్ యాడ్ షూట్ లో రామ్ చరణ్ డిఫరెంట్ డ్రెస్సింగ్ స్టైల్ తో కనిపిస్తున్నాడు. మొదటి యాడ్ లో చరణ్ తేజ్ మెజీషియన్ గా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. దీనికి బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగుతున్నందుకు గాను రామ్ చరణ్ భారీ పారితోషకం తీసుకుంటున్నట్టుగా టాక్. 

Ram Charan became the new Brand Ambassador of Disney Plus hotstar:

Ram Charan New official Suvarnabhumi Add
Show comments


LATEST TELUGU NEWS


LATEST IN NEWS

POPULAR NEWS



LATEST IN GALLERIES

POPULAR GALLERIES