Advertisement
Google Ads BL

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ కోసం బుట్టబొమ్మ


అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కిస్తున్న రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్. బన్నీ వాసు, మరో నిర్మాత ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు వాసు వర్మతో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో అఖిల్ అక్కినేని సరసన బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్‌‌గా నటిస్తున్నారు. తాజాగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ కోసం డబ్బింగ్ చెబుతున్నారు పూజ హెగ్డే. తన సొంత గాత్రంతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు పూజా హెగ్డే. 

Advertisement
CJ Advs

తెలుగులో అద్భుతమైన స్పష్టతతో డబ్బింగ్ చెబుతున్నారు. ఇప్పటి వరకు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్‌ టీం విడుదల చేసిన ప్రతి అప్డేట్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ మధ్యే విడుదలైన లెహరాయి పాటకు కూడా యూ ట్యూబ్ లో అనూహ్య స్పందన వస్తోంది. ద‌ర్శ‌కుడు బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ త‌న చిత్రాల్లోని పాత్ర‌ల్ని చాలా క్యూట్ రొమాన్స్‌తో ల‌వ్ లీగా ఉండేలా డిజైన్ చేస్తారు. అందుకే ఆయ‌న చిత్రాల‌కి ఓ ప్రత్యేకత వుంటుంది. ఇప్పుడు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమాలో కూడా అఖిల్ అక్కినేని, పూజాల మధ్య కూడా అలాంటి కెమిస్ట్రి ఉండేలా డిజైన్ చేసారు. అక్టోబర్ 8న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

Pooja Hegde dubbing for Most Eligible Bachelor:

Pooja Hegde dubbing for Akhil Akkineni Most Eligible Bachelor
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs