Advertisement
Google Ads BL

సినీజోష్ రివ్యూ: ప్లాన్-బి


బ్యానర్: ఏవీఆర్ మూవీ వండర్స్

Advertisement
CJ Advs

నటీనటులు: శ్రీనివాస్ రెడ్డి, సూర్య వశిష్ట, డింపుల్, నవీనారెడ్డి, మురళి శర్మ, రవిప్రకాష్, అభినవ్ సర్దార్, కునాల్ శర్మ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్: స్వర

ఎడిటింగ్: ఆవుల వెంకటేష్

సినిమాటోగ్రఫీ: వెంకట్ గంగాధరి

నిర్మాత: ఏవీఆర్

కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కెవి రాజమహి

డెబ్యూ డైరెక్టర్‌ని త్వరగా ప్రేక్షకులకు నోటెడ్ చేసే జోనర్‌లో థ్రిల్లర్ ఒకటి. ఈ జోనర్‌లో ఆసక్తికరంగా కథని ప్రేక్షకులకు చెప్పగలిగితే అతను సక్సెస్ అయినట్లే. ‘ప్లాన్ బి’ చిత్రం దర్శకుడు రాజమహికి మొదటి చిత్రం. థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కిన ఈ చిత్ర ట్రైలర్ విడుదల తర్వాత.. సినిమాపై అంచనాలు, ఆసక్తి క్రియేట్ అయ్యాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ వంటి వారు కూడా ఈ సినిమా గురించి పాజిటివ్‌గా మాట్లాడటం, పెద్ద సినిమాలు ఓటీటీలో విడుదలవుతున్నా.. కాన్ఫిడెంట్‌గా థియేటర్‌లో విడుదల చేయడం వంటివి ఈ సినిమాపై మరింత ఆసక్తిని క్రియేట్ చేశాయి. మరి ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా నేడు థియేటర్‌లోకి వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం.

కథ:

సద్దాం(కునాల్ శర్మ) అనే మాఫియా నాయకుడు, రిటైర్డ్ పోలీసాఫీసర్ అయిన రాజేంద్ర (టీవీ నటుడు రాజేంద్ర)ను తన దగ్గరున్న భూమికోసం హత్య చేయిస్తాడు. రాజేంద్ర చనిపోతూ తన కూతురు అవంతిక(డింపుల్)కు 10 కోట్ల డబ్బు ఇచ్చి.. తనని పెంచిన అనాథశ్రమంకి 5 కోట్లు, నువ్వొక 5 కోట్లు తీసుకోమని చెబుతాడు. అయితే అనూహ్యంగా ఆ డబ్బు దొంగలించబడుతుంది. అదే సమయంలో రాజేంద్ర లాయర్ అయిన విశ్వనాధ్(శ్రీనివాసరెడ్డి), ప్రైవేట్ కాలేజీలో పీఈటీ‌గా చేస్తున్న రిషి(అభినవ్ సర్దార్) హత్యకు గురవుతారు. విశ్వనాధ్ హత్యను ఛేదించే క్రమంలో ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ విఖ్యాత్‌సేన(మురళీశర్మ)కు కొన్ని ఆసక్తికర విషయాలు తెలుస్తాయి. అసలు ఈ హత్యలకు కారణం ఎవరు? అవంతిక దగ్గర ఉన్న 10 కోట్లు ఎవరు కొట్టేశారు? ఈ ఘటనలకు, కొన్ని సంవత్సరాల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన నాలుగు హత్యలకు లింకేంటి?. విఖ్యాత్‌సేన ఇన్వెస్టిగేషన్ ఎలా సాగింది? అసలు ‘ప్లాన్ బి’ ఎవరు?.. వంటి విషయాలు తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.    

నటీనటుల పనితీరు:

కమెడియన్ కమ్ హీరో అయిన శ్రీనివాసరెడ్డి ఈ సినిమాలో కామెడీ చేయలేదు కానీ సెటిల్డ్ ఫెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నాడు. అతని పాత్రను దర్శకుడు వైవిధ్యభరితంగా మలిచాడు. అంతే వైవిధ్యభరితంగా అతను నటించాడు. అవంతికగా డింపుల్, అతని లవర్‌ గౌతమ్‌గా చేసిన సూర్య వశిష్ట‌కు స్ర్కీన్ స్పేస్ ఎక్కువగా లభించింది. సూర్య వశిష్ట‌కు ఇది ఫస్ట్ ఫిల్మ్ అయినా.. నటనపరంగా మంచి మార్కులు వేయించుకున్నాడు. ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్‌గా నటించిన మురళీ శర్మ, అతనికి సహాయపడే పాత్రలో రవిప్రకాష్‌లకు మంచి పాత్రలు పడ్డాయి. అంతే చక్కగా వారూ మెప్పించారు. జ్యోతిగా నవీనా రెడ్డి, రిషిగా అభినవ్, సద్దాంగా కునాల్ శర్మ, రాజేంద్ర.. ఇంకా ఇతర పాత్రదారులు వారి పాత్రల పరిధిమేర నటించారు.

సాంకేతిక నిపుణుల పనితీరు:

ఈ చిత్రానికి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ప్రాణం పోసింది. థ్రిల్లర్ చిత్రాన్ని ప్రేక్షకులకి చేరువచేసే క్రమంలో శక్తికాంత్ కార్తీక్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ప్రముఖ పాత్ర పోషించింది. అలాగే వెంకట్ గంగాధరి సినిమాటోగ్రఫీ కూడా మూడ్‌ని బాగా క్యారీ చేసింది. ఆవుల వెంకటేష్ సెకండాఫ్ ఎడిటింగ్‌లో ఇంకాస్త క్రిస్ప్‌గా చేసుండవచ్చు. డైలాగ్స్ బాగున్నాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఇతర డిపార్ట్‌మెంట్స్ వారు కూడా వారి పనితనాన్ని చక్కగా ప్రదర్శించారు.

విశ్లేషణ:

థ్రిల్లర్ చిత్రాలను ప్రేక్షకులను ఎంతగా ఎంగేజ్ చేశామనే దానిపైనే ఆ చిత్రాల రిజల్ట్ ఆధారపడి ఉంటుంది. ఈ విషయంలో దర్శకుడు కెవి రాజమహి చాలా వరకు సక్సెస్ అయ్యాడు. మరీ ముఖ్యంగా ఫస్టాఫ్‌పై పెట్టిన శ్రద్ధ సెకండాఫ్‌పై పెట్టి ఉంటే ఈ థ్రిల్లర్ మరింతగా ఆదరణను పొందేది. అలాగే కాస్త పేరున్న ఆర్టిస్ట్‌లను ప్రధాన పాత్రలకు తీసుకుని ఉంటే.. జనాల్లో ఈ చిత్రం వినబడేది. అయినా తనకున్న పరిమితుల దృష్ట్యా చిత్రాన్ని చక్కగానే తెరకెక్కించాడు. మొదటి సినిమా అయినా.. ఎక్కడా ఆ ఛాయలు కనబడలేదు. ఇక కొన్ని లాజిక్స్ మిస్ అయినప్పటికీ ట్విస్ట్‌లతో ప్రేక్షకులను కూర్చోబెట్టగలిగాడు. మరీ ముఖ్యంగా కథలో మెయిన్ ట్విస్ట్‌ బాగున్నా.. ఆయన రివీల్ చేసిన తీరు ప్రేక్షకులకు అంతగా నచ్చదు. సెకండాఫ్‌లో ప్రేక్షకులను లాజిక్ లేని ట్విస్ట్‌లతో కొంత వరకు దర్శకుడు కన్ఫ్యూజ్ చేశాడు. ఇన్వెస్టిగేషన్‌లో పెద్దగా సాంకేతిక పరిమాణాలు కూడా ఏమీ కనిపించలేదు. ఇంటర్వెల్ ట్విస్ట్ ఇంట్రెస్టింగ్‌గా అనిపించినా.. దానిని రివీల్ చేసిన తీరు లాజిక్ లెస్‌గా ఉంది. మురళీశర్మతో పలికించిన డైలాగ్స్ బాగున్నాయి. ఓవరాల్‌గా కొన్ని లాజిక్స్ మిస్ అయినా.. ట్విస్ట్‌లతో దర్శకుడు తెరకెక్కించిన ఈ మర్డర్ మిస్టరీ బోర్ కొట్టదు. ముఖ్యంగా ఇటువంటి థ్రిల్లర్ చిత్రాలను ఇష్టపడేవారిని ఈ చిత్రం డిజప్పాయింట్ చేయదు.

రేటింగ్: 2.25/5

Plan B Movie Telugu Review:

Plan B Movie Review
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
CJ Advs