Advertisement
Google Ads BL

టాలీవుడ్ పెద్దలకి బిగ్ షాక్


టాలీవుడ్ పెద్దలైన చిరు, నాగ్, దిల్ రాజు, సురేష్ బాబు లాంటి వాళ్ళు ఏపీ సీఎం జగన్ ని కలిసేందుకు నానా తంటాలు పడుతున్నారు. ఏపీ సీఎం జగన్ మాత్రం సినిమా ఇండస్ట్రీ పెద్దలకి అప్పాయింట్మెంట్ ఇవ్వడం లేదు. ఈమధ్యన మంత్రి పేర్ని నాని.. టాలీవుడ్ పెద్దలకి - సీఎం జగన్ కి మధ్యన మధ్యవర్తిత్వం వహించి.. జగన్ అప్పాయింట్మెంట్ ఇప్పించారని.. ఈ నెల 20 న సీఎం జగన్ ని కలిసి ఇండస్ట్రీ సమస్యలు, ఏపీ టికెట్స్ రేట్స్ పై చర్చిస్తారని అన్నారు. రీసెంట్ గా పేర్ని నాని ప్రభుత్వంతో సినీ పెద్దల భేటీ ఉంటుంది అని చెప్పారు కానీ.. జగన్ తో ఈ డేట్ కి సినీ పెద్దలు వస్తారని  చెప్పలేదు. 

Advertisement
CJ Advs

అయితే తాజాగా ఏపీ సీఎం జగన్ ఇండస్ట్రీ పెద్దలని కలవడానికి సిదంగా లేరని, ముందు ఈ టికెట్స్ రేట్స్ విషయంలో మంత్రి పేర్ని నాని సినిమా పెద్దలతో భేటీ అవుతారని అంటున్నారు. మంత్రి తో భేటీ కోసం చిరు వెళ్తారా.. అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. జగన్ తో మీటింగ్ అంటే మరికొంతమంది ఆంధ్రాకి వెళ్లేవారు. కానీ ఇప్పుడు మంత్రి తో భేటీ కోసం చిరంజీవి ఇతర పెద్దలు వెళ్లే అవకాశం ఉందొ.. లేదో.. అనేది ఆసక్తిగా మారింది. ఇక టికెట్స్ రేట్స్ విషయంలో సినీ పెద్దల కోరిక మేరకు అని నాని మాట్లాడారు కానీ, సినీ పెద్దలెవరు ఈ విషయమై పెదవి విప్పడం లేదు. మరి జగన్ తో పెద్దల భేటీ ఎప్పుడు జరుగునో ఎవరికీ తెలియదు. 

Big Shock to Tollywood Biggies :

Tollywood industry meet with minister Perni Nani
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs