Advertisement
Google Ads BL

లవ్ స్టోరీ ఈవెంట్ కి ఆ ఇద్దరూ చీఫ్ గెస్ట్స్


నాగ చైతన్య - సాయి పల్లవి కలయికలో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన లవ్ స్టోరీ మూవీ ప్రమోషన్స్ ఓ రేంజ్ లో జరుగుతూన్నాయి. సెకండ్ వేవ్ కన్నా ముందే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా థియేటర్స్ క్లోజ్ అవడంతో వాయిదా పడి.. ఈ నెల 24 న రిలీజ్ కి రెడీ అయ్యింది.  భారీ అంచనాలున్న లవ్ స్టోరీ మూవీ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అక్కినేని ఫాన్స్ వెయిటింగ్. లవ్ స్టోరీ కి.. శేఖర్ కమ్ముల్ దర్శకత్వం, నాగ చైతన్య - సాయి పల్లవి కాంబో, సాయి పల్లవి లుక్స్, ఆమె పెరఫార్మెన్స్, సాయి పల్లవి డాన్స్ అన్ని సినిమాపై అంచనాలు పెరిగేలా చేస్తున్నాయి. ప్రస్తుతం నాగ చైతన్య - సాయి పల్లవి, శేఖర్ కమ్ముల లవ్ స్టోరీ ఇంటర్వ్యూలో హడావిడి చేస్తున్నారు. మరోపక్క లవ్ స్టోరీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ గా ప్లాన్ చేసారు మేకర్స్.

Advertisement
CJ Advs

లవ్ స్టోరీ ప్రీ రిలీజ్ ఈవెంట్.. వచ్చే ఆదివారం సాయంత్రం హైదరాబాద్ లో గ్రాండ్ గా ప్లాన్ చెయ్యడమే కాదు.. ఈ ఈవెంట్ కి మెగాస్టార్ చిరు తో పాటుగా నాగార్జున చీఫ్ గెస్ట్ లుగా హాజరవుతున్నారు. మెగాస్టార్ చిరు అంటే లవ్ స్టోరీ కి మెగా పవర్ వచ్చినట్టే.. చిరు అండ్ నాగ్ లు చైతు లవ్ స్టోరీ కి బూస్ట్ ఇవ్వడానికి స్పెషల్ చీఫ్ గెస్ట్ లుగా ఈ ఈవెంట్ కి స్పెషల్ అట్రాక్షన్ కాబోతున్నారు. 

Top Heroes to grace Love Story pre-release function:

Chiru and Nag Chief Guest at Love Story Pre Release event
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs