బిగ్ బాస్ 5 మొదలు కావడమే గొడవలతో మొదలైంది. ఒకే ఒక్క రోజు స్నేహంగా ఉన్న కంటెస్టెంట్స్ అంతా ఎవరికి వాళ్లే టైటిల్ విన్నర్ అవ్వాలి అనుకుంటున్నారు. దానికి అనుగుణంగానే బిగ్ బాస్ గేమ్ ఆడేస్తున్నారు. తాజాగా కెప్టెన్సీ టాస్క్, ఈ వారం నామినేషన్స్ ప్రక్రియలో అందరూ కొట్టేసుకుని తిట్టేసుకున్నారు. బిగ్ బాస్ కెప్టెన్సీ టాస్క్ లో ప్రతి ఒక్కరు గెలవాలనే కసితో ఆడారు. దాని కోసం హౌస్ మొత్తం రణరంగం చేసారు. సన్నీ vs ప్రియాంక అన్న రేంజ్ లో గొడవలు, శ్రీరామ చంద్ర vs మానస్, శ్రీరామ చంద్ర vs రవి అన్నట్టుగా గొడవ జరిగింది. అది ఓకె.
కానీ ఆడవాళ్ళ మధ్యన ఈ టాస్క్ నిప్పు రాజేసింది. సిరి అరుస్తూ రెచ్చిపోతూ నానా యాగీ చేసింది. అలాగే కాజల్ కూడా అంతే. ఇక ప్రియా, యాని మాస్టర్ కలిసి ఉమా దేవిని ఆడుకున్నారు. ఉమా దేవి తక్కువ తిందా.. బూతులతో రెచ్చిపోయింది. చిల్లర దానా అని యాని మాస్టర్ ఉమాదేవిని అంటే.. అవును నేను చిల్లరదాన్నే.. నువ్వేమన్నా క్లాస్ గా వచ్చవా అంటూ రెచ్చిపోయింది. సిరి vs ఉమాదేవి.. అబ్బో నువ్వు కొట్టావ్ అంటే నువ్వు కొట్టావ్ అంటూ రచ్చ రచ్చ చేసారు. మరి ఈ వారం కెప్టెన్సీ టాస్క్ లో ఎవరు గెలుస్తారో కానీ.. ఆ టాస్క్ ఈ రోజు గురువారం కూడా కొనసాగుతుంది.