టాలీవుడ్ లో చాలామంది సెలబ్రిటీస్ మనీ లాండరింగ్, డ్రగ్స్ కేసులో ఈడీ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నారు. ఈ మనీ లాండరింగ్ కేసు మొత్తం ఎఫ్ క్లబ్బు పార్టీల చుట్టూ తిరుగుతుంది. రవితేజ, నవదీప్, రానా, రకుల్, నందు, పూరి, తనీష్, ఛార్మి లాంటి సెలబ్రిటీస్ ఈ ఎఫ్ క్లబ్బు పార్టీలకు హాజరయ్యేవారని, ఈ కేసులో బోలెడంత డబ్బు చేతులు మారాయని, డ్రగ్స్ కూడా సరఫరా చేసారంటూ అధికారులు సాక్ష్యాలతో సహా సెలబ్రిటీస్ ని విచారణకు పిలిచారు. ఎఫ్ క్లబ్ పార్టీలో సిసి టివి ఫుటేజ్ లో రానా, రకుల్ కూడా దొరకడంతో వాళ్ళకి కూడా నోటీసు లు ఇచ్చారు.
ఇక ఈ కేసులో నేడు ముమైత్ ఖాన్ ఈడీ విచారణలో పాల్గొంది. ముమైత్ ఖాన్ ఈ కేసులో ప్రధాన నిందుతుడు కెల్విన్ తో కలిసి డ్రగ్స్ సరఫరా చెయ్యడం, ఎఫ్ క్లబ్ మేనేజర్ తో కలిసి ముమైత్ ఖాన్ ప్రముఖులకు డ్రగ్స్ సరఫరా చెయ్యడం దగ్గర నుండి.. ఎఫ్ క్లబ్బు పార్టీలలో ముమైత్ నే కీలకమని చెబుతున్నారు. ముమైత్ ఖాన్ బ్యాంకు అకౌంట్స్ లావాదేవీలు అన్ని ముంబై వేదికగా ఉన్నాయని, ముమైత్ ఖాన్ ఎఫ్ క్లబ్ మేనేజర్ కలిసే పార్టీలు నిర్వహించేవారని.. ఈ పార్టీలలో లెక్కకు మించిన డబ్బు చేతులు మారినట్లుగా అనుమానంతోనే ఈరోజు ముమైత్ ని ఈడీ అధికారులు విచారిస్తున్నారు. గత కొన్ని గంటలుగా ఈడీ ఆఫీస్ లో ముమైత్ ఖాన్ ని ఈడీ అధికారులు విచారిస్తున్నారు.