Advertisement
Google Ads BL

నవీన్ పోలిశెట్టి కొత్త సినిమా అనౌన్సమెంట్


ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ అంటూ సస్పెన్స్ థ్రిల్లర్ తో అదరగొట్టేసిన నవీన్ పోలిశెట్టి జాతి రత్నాలు అంటూ పోలికేకలు పెట్టే కామెడీతో కడుపుబ్బా నవ్వించాడు. ఇక ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతూ, తన సక్సెస్ గ్రాఫ్ ను పెంచుకుంటూ సినిమా రంగంలో ఎదుగుతున్న సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్. ఈ సంస్థ ఇప్పుడు మరో నూతన చిత్ర నిర్మాణ సంస్థ తో కలసి మరింత వినోదాన్ని పుష్కలంగా అందించటానికి సిద్ధమవుతోంది. ఆ నూతన చిత్ర నిర్మాణ సంస్థ పేరు ఫార్చ్యూన్ 4 సినిమాస్. ఈ సంస్థ కిది తొలి చిత్రం కాగా  సితార ఎంటర్ టైన్మెంట్స్ కి 15 వ చిత్రం. తెలుగు సినిమా శ్రీకారం చుట్టుకున్న రోజు అయిన(1931,సెప్టెంబర్ 15) ఈరోజు నే ఈ ఫార్చ్యూన్ 4 సినిమాస్ సంస్థ పురుడు పోసుకోవడం విశేషం. 

Advertisement
CJ Advs

నవీన్ పోలిశెట్టి

ఈ తరం వినోదానికి నిఖార్సైన చిరునామా. 

ఆయన కథానాయకుడు గా సితార ఎంటర్ టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించనున్న తొలిచిత్రాన్ని ఈరోజు ఉదయం 9.36 నిమిషాలకు అధికారికంగా ప్రకటించాయి. దీనికి సంబంధించిన ప్రచార చిత్రాన్ని కూడా విడుదల చేశారు. ప్రతిభగల యువకుడు కళ్యాణ్ శంకర్ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. 

ప్రేక్షకులుగా మీరు మరింత సరదాగా నవ్వుకోవడానికి సమాయుత్త మవ్వండి, మేము వినోదాన్ని పంచడానికి సిద్ధమవుతున్నాము అంటూ ప్రకటించారు. వినోదం పరమావధిగా నవీన్ పోలిశెట్టి సరికొత్త అవతారం ఈ చిత్రం స్వంతం. కథానాయకుడు గా ఆయనకిది మూడవ చిత్రం. చిత్ర పూర్వ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. పి.డి.వి. ప్రసాద్ సమర్పణలో రూపొందనున్న ఈ చిత్రానికి సంభందించిన మరిన్ని వివరాలను, విశేషాలను మరో సందర్భంలో మీడియాకు ప్రకటించనున్నట్లు సితార ఎంటర్ టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ సంస్థల నిర్మాతలు సూర్య దేవర నాగవంశీ, శ్రీమతి సాయి సౌజన్య లు తెలిపారు. 

Naveen Polishettyn new movie announcement :

Trivikram Srinivas to produce Naveen Polishetty next
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs