నాగ చైతన్య రీసెంట్ మూవీ లవ్ స్టోరీ ట్రైలర్ నిన్న రిలీజ్ అయ్యింది. లవ్ స్టోరీ ట్రైలర్ ని వీక్షించిన సినీ ప్రముఖులు నాగ చైతన్య ని, లవ్ స్టోరీ టీం ని పొగిడేస్తూన్నారు. అయితే కొన్నాళ్లుగా నాగ చైతన్య ఆయన భార్య ప్రముఖ హీరోయిన్ సమంత విడిపోతున్నారంటూ సోషల్ మీడియాలో న్యూస్ ప్రచారంలో ఉంది. కొన్నాళ్లుగా నాగ చైతన్య-సమంత విడివిడిగా ఉంటున్నారు.. త్వరలోనే వారు విడాకులు తీసుకోబోతున్నారని ప్రచారం జరుగుతుంది. అయితే నిన్న లవ్ స్టోరీ ట్రైలర్ చూసిన సమంత విన్నర్.. ఆల్ ద బెస్ట్ లవ్ స్టోరీ టీం అంటూ నాగ చైతన్య ని టాగ్ చెయ్యకుండా.. సాయి పల్లవి, లవ్ స్టోరీ ని టాగ్ చెయ్యడంతో.. చైతూ ని వదిలేసి.. అందరిని టాగ్ చేసింది.. అంటే సమంత నిజంగానే చైతూకి విడాకులు ఇచ్చేస్తుందా అని అనుకుంటున్నారు.
అయితే సమంత ట్వీట్ కి నాగ చైతన్య రిప్లై ఇచ్చాడు. విన్నర్ ఆల్ ద బెస్ట్ లవ్ స్టోరీ టీం.. అని సమంత ట్వీట్ వేస్తె.. దానికి నాగ చైతన్య థాంక్స్ సామ్ అంటూ రిప్లై ఇచ్చాడు. మరి దీనిని బట్టి వారి మధ్యలో కలతలు, కలహాలు లేవని అనుకోవాలా.. ఏమో వారిలో ఎవరో ఒకరు ఈ విడాకుల మేటర్ విషయమై స్పందించే వరకు అందరూ కన్ఫ్యూజ్ అవుతూనే ఉంటారు.