సీనియర్ నటుడు కృష్ణంరాజు గారు తన రొటీన్ హెల్త్ చెకప్ కోసం అపోలో హాస్పిటల్ కి వెళ్ళగానే ఆయన ఆరోగ్యంపై అభిమానులు ఆందోళన పడుతున్నారు. గతంలోనూ కృష్ణంరాజు గారు హెల్త్ చెకప్స్ కోసం హాస్పిటల్ కి వెళ్ళగానే ఆయనకి ఏదో అయ్యింది అంటూ కంగారు పడడం వెంటనే ఆయన పిఆర్ టీం హెల్త్ పై అప్ డేట్ ఇవ్వడం చూసాం. తాజాగా కృష్ణం రాజు గారు అపోలోకి వెళ్లడంతో మరోసారి ఆయన ఆరోగ్యంపై సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి.
అయితే కృష్ణంరాజు గారు కేవలం రొటీన్ హెల్త్ చెకప్ కోసం అపోలోకి వచ్చారు.. అని, ఆ చెకప్ పూర్తి చేసుకుని అక్కడే నాలుగు రోజులుగా ఐసియు లో చికిత్స పొందుతున్న సాయిధరమ్ తేజ్ హెల్త్ విషయంగాను సాయి ధరమ్ కుటుంబ సభ్యులతో చర్చించారు..
సాయి ధర్మమ్ తేజ్ త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నాను అని కృష్ణంరాజు గారు చెప్పారు. అయితే కృష్ణంరాజు గారు త్వరలో యూకే వెళ్లాల్సి ఉన్నందున రొటీన్ హెల్త్ చెకప్ చేసుకోవడానికి అపోలోకి వచ్చారు.. అని ఆయన కార్యాలయం ఓ లేఖని విడుదల చేసింది.