Advertisement
Google Ads BL

అల్లు అర్జున్ సింప్లిసిటీ


అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప షూటింగ్ కోసం కాకినాడ, మరేడిమిల్లు ఫారెస్ట్ చుట్టుపక్కలే స్టే చేసిన విషయం తెలిసిందే. సుకుమార్ అండ్ అల్లు అర్జున్ లు పుష్ప షూటింగ్ కోసం మరోసారి ఫారెస్ట్ కి వెళ్లారు. రెండు రోజుల క్రితం కాకినాడలో భారీ వర్షం పడడంతో పుష్ప షూటింగ్ కి బ్రేక్ ఇచ్చి అల్లు అర్జున్ ఫాన్స్ తో కలిసి గోపీచంద్ సీటిమార్ సినిమాని కాకినాడ థియేటర్ లో వీక్షించాడు. అక్కడ వర్షాలు తగ్గడంతో అల్లు అర్జున్ మళ్ళి యధావిధిగా పుష్ప షూటింగ్ లో పాల్గోంటున్నాడు. 

Advertisement
CJ Advs

షూటింగ్ కి వెళ్లే దారిలో రోడ్డు పక్కన కారు ఆపి ఓ చిన్న హోటల్ లో టిఫిన్ చెయ్యడం అందరిని ఆకర్షించింది. అల్లు అర్జున్ అండ్ పుష్ప టీం తో కలిసి తూర్పు గోదావరి జిల్లా గోకవ‌రం మీదుగా వెళ్తున్నాడు. ఆ స‌మ‌యంలో రోడ్డు ప‌క్క‌న ఎన్టీఆర్ విగ్ర‌హం వ‌ద్ద‌ ఓ చిన్న హోట‌ల్ ఉండడంతో అల్లు అర్జున్ టిఫిన్ కోసం కారు ఆపి అందులోకి వెళ్లడమే కాదు.. టిఫిన్ చేసిన త‌ర్వాత బిల్ చెల్లించి బ‌న్నీ మ‌ళ్లీ కారు ఎక్కి వెళ్లడం చూసిన ఫాన్స్ ఆ వీడియో ని వైరల్ చేస్తూ.. బన్నీ సింప్లిసిటీకి మురిసిపోతున్నారు. స్టార్ హీరో అయ్యుండి.. ఇలా చిన్న హోటల్ లో బన్నీ ఆగడం మాములు విషయం కాదు అంటున్నారు బన్నీ ఫాన్స్. 

Allu Arjun Simplicity:

Allu Arjun spotted at Road Side Tiffin Centre
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs