Advertisement
Google Ads BL

తగ్గేదే లే అంటున్న కరీనా కపూర్


ఎప్పుడు అందంతో, బికినీ షోతో, సైజు జీరో అంటూ సోషల్ మీడియాలో బాగా హైలెట్ అయ్యే కరీనా కపూర్ ఈమధ్యన పారితోషకం విషయంలో బాగా హైలెట్ అవుతుంది. టాలీవుడ్ టాప్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ రాసుకున్న పాన్ ఇండియా మూవీ కోసం కరీనా కపూర్ ని అడగగా.. ఆ సినిమా కోసం కరీనా కపూర్ 12 కోట్ల పారితోషకం అడగడంతో ఆమెని ట్రోల్ చేస్తున్నారు నెటిజెన్స్. రామాయణం ఆధారంగా రూపొందనున్న సినిమాలో కరీనా కపూర్ ని సీత పాత్రకి సంప్రదించగా.. ఆమె ఏకంగా 12 కోట్లు డిమాండ్ చేసిందట. విజయేంద్ర ప్రసాద్ కథ రాస్తున్న ఈ చిత్రం పాన్ ఇండియన్ స్థాయిలో తెరకెక్కుతుంది. 

Advertisement
CJ Advs

కరీనా పారితోషకమై కొంతమంది పాజిటివ్ గా ఆమెకి మద్దతు తెలుపుతుంటే.. మరికొంతమంది కరీనా కపూర్ ని ట్రోల్ చేస్తున్నారు. అలా భారీ పారితోషకం డిమాండ్ చేస్తూ అడగడం తప్పు, హీరోలు ఫైట్స్, డాన్స్.. సినిమాలో లీడ్ తీసుకుంటారు కాబట్టి వారికీ భారీ పారితోషకం అని కొందరు అంటుంటే.. హీరోలతో సమానమైన కేరెక్టర్స్ చేసినప్పుడు వాళ్ళకి సమానమైన పారితోషకం ఇవ్వాల్సిందే కదా అని అంటున్నారు కొందరు.  

రామాయణంలో రాముడి పాత్ర ఎంత కీలకమో.. సీత పాత్ర అంతే కీలకం అంటూ కరీనా కపూర్ తాను డిమాండ్ చేసిన 12 కోట్ల పారితోషకం విషయంలో తగ్గేదే లే అంటుందట. ఈ సినిమాలో రాముడి కన్నా ఎక్కువగా సీత పాత్ర ముఖ్యం అందుకే తాను 12 కోట్లు అడిగాను.. అందులో ఎలాంటి తప్పు లేదని వాదిస్తుంది కరీనా కపూర్. 

Kareena Kapoor says it will not go down:

Latest News on Kareena Kapoor remuneration
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs