Advertisement
Google Ads BL

గుజరాత్‌ కొత్త సీఎంగా..


గుజరాత్‌ ముఖ్యమంత్రి విజయ్‌ రూపానీ శనివారం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఈ మేరకు బీజేపీ వ్యూహం రచిస్తోంది. అందులో భాగంగా ఆ రాష్ట్రంలో పరిణామాలు అనూహ్యంగా మారుతున్నాయి. ప్రస్తుతం గుజరాత్ కొత్త ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్‌ ఎన్నికయ్యారు. ఈ మేరకు బీజేపీ శాసనసభాపక్షం ఏకగ్రీవంగా పటేల్‌ను ఎన్నుకుంది. భూపేంద్ర పటేల్‌ ఘట్లోడియా నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. కేంద్ర పరిశీలకులుగా విచ్చేసిన నరేంద్ర సింగ్‌ తోమర్‌, ప్రహ్లాద్‌ జోషి నేతృత్వంలో ఆదివారం సమావేశమైన శాసనసభాపక్షం ఈ మేరకు భూపేంద్ర పటేల్‌ను ఎన్నుకుంది. పటేల్‌ సామాజికవర్గానికి ప్రాధాన్యం ఇవ్వాలనే నిర్ణయంతో ముఖ్యమంత్రిగా భూపేంద్ర పేరును ఖరారు చేశారు. 

Advertisement
CJ Advs

Bhupendra Patel Is New Chief Minister Gujarat:

Ghatlodiya MLA Bhupendra Patel to be the next Gujarat CM
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs